ఏపి సహా దేశవ్యప్తంగా చుక్కలు చూపిస్తున్న టొమాటో ధరతో కొనుగోలు దారులు బెంబేలెత్తుతున్నారు. ఏపి లో పలు మార్కెట్ల లో ఏకంగా కిలో ₹120 కి అమ్ముడు అవుతుంది.
తక్కువ దిగుబడి మరియు ఇటీవల అకాల వర్షాలతో టొమోటో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆదివారం మధ్య ప్రదేశ్ లోనీ రైసన్ మార్కెట్ లో అయితే టొమాటో ఏకంగా ₹160 రూపాయలు పలకటం గమనార్హం
సబ్సిడీ పై టొమోటో విక్రయిస్తున్న ఏపి ప్రభుత్వం
సీఎం యాప్ ద్వారా నిత్యావసర ధరల ను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం, టొమోటో ధరల నియంత్రణ కు చర్యలు తీసుకుంటుంది.
రైతుల నుంచి మార్కెట్ వద్ద ₹90 నుంచి ₹104 మధ్యలో చెల్లించి , సబ్సిడీ పై కిలో ₹50 కే రైతు బజార్లలో అమ్మడం జరుగుతుంది.
జూలై 1 నుంచి ప్రతి రోజూ 50 టన్నుల టొమాటో ను ప్రభుత్వం కొనుగోలు చేసి సబ్సిడీ పై అందిస్తుంది. విశాఖ కు ఎక్కువ స్థాయిలో నిల్వలను తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి జిల్లా కేంద్రాలు, ప్రముఖ రైతు బజార్లలో మాత్రమే ఈ సబ్సిడీ పై ప్రభుత్వం టొమోటో ను అందిస్తుంది.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
వ్యాపారులు కుత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తో రైడ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సీఎం యాప్. ద్వారా ఇతర కూరగాయల పైన కూడా నిత్యం పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
Leave a Reply