రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పాఠశాల విద్యార్థులకు ఆరు రకాల వస్తువులతో విద్యా కానుక కిట్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పాఠశాలలు ప్రారంభం అవుతునే ఈ కిట్ల పంపిణీ కి ప్రభుత్వం సిద్ధమైంది.
ఆరోజే జగనన్న విద్యా కానుక
జూన్ 12న పల్నాడు జిల్లా పెదకూరపాడు పర్యటనలో భాగంగా జగనన్న విద్యా కానుకను సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యా కానుక కిట్స్ సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ కు చేరుకుంటున్నాయి.
విద్యా కానుక కిట్ లో భాగంగా పిల్లలకు ఏమి అందిస్తారు
ఈ కిట్లో భాగంగా మొత్తం ఆరు రకాల వస్తువులను పిల్లలకు అందించడం జరుగుతుంది. అయితే ఒకటి మరియు ఆరో తరగతి విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు పంపిణీ చేస్తారు.
పూర్తి జాబితా కింద ఇవ్వబడింది
1. మూడు జతల యూనిఫాం
2. నోట్ బుక్స్ మరియు పుస్తకాలు
3. బూట్లు లేదా షూస్
4. రెండు జతల సాక్సులు
5. బెల్ట్
6. స్కూల్ బ్యాగ్
7. అదనంగా ఒకటి మరియు ఆరవ తరగతి వారికి డిక్షనరీ
Leave a Reply