ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్ని విడుదల చేసింది. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌కు సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. త్వరలోనే మిగిలిన రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని.. ప్రభుత్వం మరోసారి విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడంలో నిబద్ధతను నిరూపించుకుందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి రూ.600 కోట్లు విడుదల చేసింది.

గతంలో దశలవారీగా ఫీజుల బకాయిలను కూడా చెల్లిస్తామని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు అన్నారు. అలాగే విద్యార్థుల్ని తరగతులకు హాజరుకాకుండా నిరోధించడంతో పాటుగా హాల్‌ టికెట్లు నిలిపివేయడం, పరీక్షలు రాయనీయకుండా అడ్డుపడడం వంటి చర్యలకు దిగితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ నిధుల్ని కాలేజీ అకౌంట్‌కు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల తల్లుల అకౌంట్‌‌లో జమ చేస్తున్నారు. ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది.

Click here to Share

You cannot copy content of this page