Free bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్టు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ముఖ్యమంత్రి బిగ్ షాక్ ఇచ్చారు.
అయితే, ఈ ఉచిత బస్సు ప్రయోజనం కేవలం ఆయా జిల్లాల మహిళలకు తమ జిల్లాలోనే వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల హామీ ప్రకారం అమలవుతుంది. కానీ, ఈ ప్రయోజనం కేవలం తమ జిల్లాలోనే ఉంచడం మంచిదని నిర్ణయించాం. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించేందుకు వీలుండదు” అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా వివరించడంతో పాటు, ప్రజల్లో ఉన్న అనుమానాలకు తొలగించే ప్రయత్నం చేశారు.
ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లాల మధ్య కూడా అందుబాటులోకి తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం దీనికి ఓ నిర్ణీత వ్యవస్థ ఏర్పాటు చేయాలి” అని సూచించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ఎంతో మందికి ఉపయోకరంగా మారుతుంది. అయితే, దీన్ని సక్రమంగా అమలు చేయడంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి” అన్నారు.
ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో ఆనందం ఉన్నప్పటికీ, జిల్లాల మధ్య ప్రయాణం ఉండకపోవడం కొందరికి నిరాశ కలిగించే అంశమైంది. ముఖ్యంగా, ఉద్యోగరీత్యా, విద్యా అవసరాల కోసం జిల్లాల మధ్య వెళ్తున్న మహిళలకు ఈ పథకం మరింత విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండొచ్చు
Join us on WhatsApp for more updates
Leave a Reply