పథకాల డబ్బులు పొందాలంటే NPCI తప్పనిసరి, నవంబర్ 15 డెడ్ లైన్

పథకాల డబ్బులు పొందాలంటే NPCI తప్పనిసరి, నవంబర్ 15 డెడ్ లైన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు నేరుగా తమ బ్యాంక్ ఖాతాలో నగదును పొందాలి అంటే తప్పనిసరిగా npci యాక్టివ్ లో ఉండాలి. ఈ నేపథ్యంలో అసలు ఎన్పీసీఐ లింకింగ్ అంటే ఏంటి? ఎలా లింక్ చేసుకోవాలి? స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్పీసీఐ లింకింగ్ అంటే ఏమిటి?

NPCI (National Payment Corporation of India) అనేది దేశంలో  నగదు లావాదేవీలను నిర్వర్తించే సంస్థ. ప్రముఖంగా యూపీఐ మరియు ప్రభుత్వ రంగ లావాదేవీలను ఈ సంస్థ నిర్వర్తిస్తుంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు ను నేరుగా అకౌంట్ లో పొందెందుకు తప్పనిసరిగా ఎన్పీసీఐ ద్వారా బ్యాంక్ ఖాతా తో ఆధార్ ను లింక్ చేసుకోవాలి. దీనినే మనం npci లింకింగ్ లేదా ఆధార్ సీడింగ్ అని కూడా అంటాము.

ఆధార్ సీడింగ్ అయిన ఖాతాలకు మాత్రమే ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నగదును నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.

NPCI లింక్ అయిందా లేదా ఎలా స్టేటస్ చెక్ చేయాలి [How to check npci status or adhar seeding status]

మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ జరిగి NPCI డేటా లో ఆక్టివ్ ఉందా లేదా అనేది మీరు కింది ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా ఇక్కడ ఇవ్వబడిన link పైన క్లిక్ చేయండి.
  2. మీ ఆధార్ మరియు OTP ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  3. లాగిన్ అయిన తర్వాత మీకు కింది ఆప్షన్ కనిపిస్తుంది. “Bank seeding status” దానిపైన క్లిక్ చేయండి.

4. ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తూనే మీకు మీ ఆధార్ సీడింగ్ అయినటువంటి బ్యాంక్ ఖాతా మరియు ఎన్పీసీఐ స్టేటస్ యాక్టివ్ ఉందా ఇనాక్టివ్ ఉందా అనేది చూపిస్తుంది.

NPCI మ్యాపింగ్ లేదా ఆధార్ సీడింగ్ ఎలా చేయించుకోవాలి? [How to complete aadhar seeding]

పైన పేర్కొన్న ప్రాసెస్ ప్రకారం ఒకవేళ మీకు NPCI మ్యాపింగ్ ఇనాక్టివ్ చూపిస్తే,  మీ బ్యాంక్ ను సందర్శించి వారి ద్వారా ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి. ఆధార్ సీడింగ్ ఫామ్ ఫిల్ చేసి, మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తో పాటు సమర్పించాలి. ఆధార్ సీడింగ్ అప్డేట్ అవ్వడానికి 5-6 రోజుల సమయం పడుతుంది.

మీరు మీ దగ్గరలోని సచివాలయంలో కూడా సంప్రదించవచ్చు. సచివాలయ సిబ్బంది మీకు సహాయం చేయడం జరుగుతుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుకొని  64,81,632  మందికి ఎన్పీసీఐ ఇన్ ఆక్టివ్ చూపిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇటువంటి వారందరికీ కూడా నవంబర్ 15 2024 లోపు NPCI ఆక్టివ్ చేయించాలని సచివాలయాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు జారీచేసిన ఉత్తర్వుల కాపీని కింద డౌన్లోడ్ చేసుకోగలరు.

Download government GO on NPCI Mapping here

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page