ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ల కు ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా ప్రయాణించవచ్చు.
Update: ఉచిత ప్రయాణానికి త్వరలో స్మార్ట్ కార్డులు
స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందిస్తామని మని ఆర్టీసీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఆధార్ కార్డు జిరాక్స్ చూపించినా కూడా అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం. ఘాట్ రోడ్డు లలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అనుమతిస్తూ నిర్ణయం.
CM, Dy CM, Ministers flagging off free bus travel scheme in Andhra Pradesh
— STUDYBIZZ Govt Schemes Updates (@studybizzscheme) August 15, 2025
ఏపీ ఉచిత బస్సు ప్రయాణ పథకం – స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి (Stree Shakti) పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15, 2025 (స్వాతంత్ర్య దినోత్సవం) న మంగళగిరి నుండి ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం చదువు, ఉద్యోగం, ఆరోగ్య సేవలకు సులభంగా, ఆర్థిక భారం లేకుండా ప్రయాణించడానికి మహిళలకు లబ్ధి చేకూరుస్తుంది.
ఏ ఏ బస్సులలో ఉచిత ప్రయాణం ఉంటుంది? Free bus travel in these services
పల్లె వెలుగు – Palle Velugu
అల్ట్రా పల్లె వెలుగు – Ultra Pallevelugu
సిటీ ఆర్డినరీ – City Ordinary
మెట్రో ఎక్స్‌ప్రెస్ – Metro Express
ఎక్స్‌ప్రెస్ బస్సులు – Express Bus
పల్లె వెలుగు Metro Express అల్ట్రా పల్లె వెలుగు City ordinary Express
ఏ బస్సులలో ఉచిత ప్రయాణం ఉండదు?
నాన్-స్టాప్ సర్వీసులు
అంతర్రాష్ట్ర బస్సులు
కాంట్రాక్ట్ క్యారేజ్
చార్టర్డ్
ప్యాకేజీ టూర్లు
సప్తగిరి ఎక్స్‌ప్రెస్
అల్ట్రా డీలక్స్
సూపర్ లగ్జరీ
స్టార్ లైనర్
అన్ని AC బస్సులు
Deluxe Super Luxury
ఉచిత బస్సు ప్రయాణం ఎలా పొందాలి? (Zero Ticket Guide)
Lady taking first zero ticket from conductor and CM
మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు పథకంలో ఉండే బస్సుల వివరాలు తెలుసుకోవాలి.
బస్సు ఎక్కేముందు మీ వద్ద ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రం తప్పనిసరిగా ఉండాలి.
బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వద్ద Zero Ticket తప్పనిసరిగా తీసుకోవాలి.
Zero Ticket లేకుండా ఉచిత ప్రయాణం చేయరాదు; లేకపోతే ఫైన్ విధించబడుతుంది.
ముఖ్య గమనిక
గుర్తింపు కార్డు చూపించడమే సరిపోదు. గుర్తింపు కార్డు చూపించి Zero Ticket తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఉచిత ప్రయాణం చెల్లుతుంది. ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
Click here to Share
One response to “AP Free Bus Scheme – ఏపీలో Stree Shakti ఉచిత బస్ పథకం ప్రారంభం”
Leave a Reply