రాజధాని ప్రాంతమైనటువంటి సిఆర్డిఏ పరిధిలో అర్హులైన 50793 మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తుంది . మే 26న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాజధాని ప్రాంతంలో ఈ ప్లాట్ల పంపిణీ సంబంధించి హైకోర్టులో అడ్డంకి తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం హుటాహుటిన పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అత్యంత వేగంగా ప్లాట్లకు హద్దులు వేసి మే 26న మొత్తం 50793 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది.
CRDA పరిధిలో 1,402.58 ఎకరాల్లో సిద్ధమైన 25 లే ఔట్ల పరిధిలో 50793 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ ని తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వేదిక నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
అదే వేదిక నుంచి గత ప్రభుత్వం నిర్మించినటువంటి 5024 tidco ఇళ్లను కూడా పంపిణీ చేయడం జరిగింది.
పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్ మరియు అప్డేట్స్ కింది లింక్ ద్వారా పొందవచ్చు
One response to “AP HOUSING : సిఆర్డిఏ పరిధిలో 50793 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సీఎం”
రామచంద్రపురం మండలం వల్ల గ్రామం ఇంటి నెంబర్ 6 64 ఈ నెంబరు హౌస్ 30 సంవత్సరాలుగా తాటాకు ఇంట్లో ఉంటున్నాము గత నాలుగు సంవత్సరాల కింద అది పడిపోయింది జగనన్న ప్రభుత్వ నాలుగు సంవత్సరాల బట్టి హౌస్ కి అప్లై చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్పందన లేదు దయచేసి మాకు హౌస్ లోనే ఇప్పించండి లేదంటే జగనన్న కాలిన స్థలం ఇవ్వండి మేము ఇల్లు కట్టుకుంటాం మ దయచేసి ప్రభుత్వం వారు మా హిందూ దయ ఉంచి అద్దె ఇల్లు నుంచి మాకు సమస్య పరిష్కరించండి