ఒడిస్సా లో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో ఏపి నుంచి ప్రాణాలు కోల్పోయిన వారికి మరియు గాయపడిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
ఏపి ప్రభుత్వం ఎంత పరిహారం ప్రకటించింది?
రైలు దుర్ఘటనలో మరణించిన ఏపి వారికి పది లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఇక తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు ఈ రైలు దుర్ఘటనలో 275 మంది వరకు చనిపోయిన విషయం తెలిసిందే.. ఇప్పటికీ పలువురు చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే రాష్ట్రం నుంచి కేవలం ఒక్కరు మాత్రమే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక మిగిలిన వారిలో చాలామంది స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. అయితే పలువురు చికిత్స ఇప్పటికి పొందుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిహారం కేవలం ఆంధ్రప్రదేశ్ వాసులకు మాత్రమే వర్తిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి నష్టపరిహారం కి అదనంగా మీ అమౌంటును చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం ఎంత పరిహారం ప్రకటించింది?
రైలు దుర్ఘటనలో మరణించిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ప్రకటించారు.
కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇవే
ఇప్పటికే కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనకు సంబంధించి క్షతగాత్రుల సమాచారం కోసం ఏపి రాష్ట్ర విపత్తు సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ 24/7 కంట్రోల్ రూమ్ నంబర్స్ ను ప్రకటించింది.
మిస్ అయిన వారి సమాచారం కోసం 1070, 112 లేదా 18004250101 నెంబర్స్ కి ఫోన్ చేయాలని సూచించడం జరిగింది. ఇక ఈ సదుపాయం వాట్సప్ ద్వారా కూడా కల్పించడం జరిగింది. 8333905022 నెంబర్ కి ప్రయాణీకుల ఫోటోను పంపించాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Leave a Reply