ఏపి లో భూమి హక్కులు మరియు పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
54 వేల ఎకరాల భూమి ని పంపిణీ చేయనున్న ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందిన 46,935 మంది నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం 54,129.45 ఎకరాల వ్యవసాయ భూమి ని వారికి పంపిణీ చేసి వారిని రైతులుగా మార్చ నుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అధ్యక్ష్యతన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అసైన్డ్ భూములు కలిగిన రైతులకు గుడ్ న్యూస్
గతంలో ప్రభుత్వం వ్యవసాయం చేసుకునేందుకు బలహీన వర్గాలకు భూమిని కేటాయించి వారికి అసైన్డ్ చేసిన భూములను అసైన్డ్ భూములు అంటారు. అయితే వీటిపై వ్యవసాయం చేసుకునే హక్కులు మాత్రమే ఉంటాయి.
Government of AP to provide complete rights on assigned lands to the farmers.
అసైన్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై వారికి పూర్తి హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
- అనైన్డ్ ల్యాండ్ కలిగిన రైతులకు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో క్రయ విక్రయాలపై పూర్తి హక్కులు రైతులకు అందనున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మందికి లబ్ది చేకురనుంది. ఒకవేళ భూమి పొందిన రైతులు మరణిస్తే వారి వారసులకు ఇవి చెందుతాయి.
లంక భూములకు విముక్తి
మూడు క్యాటగిరిలలో ఉన్న 9,062 ఎకరాల లంక భూముల రైతులకు డీ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 19176 మంది రైతులకు మేలు జరుగుతుంది.
పేదలకు భూమి, లంక భూములకు డీ పట్టాలు ఇవ్వడం తో మొత్తం 63,191,84 ఎకరాలకు సంబంధించి 66,111 మందికి లబ్ది చేకూరుతుంది.
ఇంకా భూములకు సంబంధించి రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేస్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు కట్టాల్సిన రుణాలు మాఫీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పూర్తి హక్కులు వారికి లభిస్తాయి.
కేంద్రం ఇదివరకే ఆమోదం తెలపడంతో అమరావతి పరిధిలోని 47 వేల సీఆర్డీఏ ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.