రేషన్ కార్డుదారులకు శుభవార్త… నవంబర్ నెల నుంచి ఈ నాలుగు సరుకులు పంపిణీ

రేషన్ కార్డుదారులకు శుభవార్త… నవంబర్ నెల నుంచి ఈ నాలుగు సరుకులు పంపిణీ

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు అందిస్తున్నది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డు లేకపోతే దారులకు వచ్చే నెల అనగా నవంబర్ నెల నుంచి నాలుగు రకాల సరుకులను అందజేయాలని నిర్ణయించుకుంది.

వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు పంచదార జొన్నలు పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ నెలలో 50 శాతం మందికి మాత్రమే అందించిన కందిపప్పును నవంబర్ నెలలో 100% లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఎవరైనా లబ్ధిదారులు బియ్యం బదులు జొన్నలు కావాలంటే తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సరుకులను మాత్రమే అందించాలని ప్రభుత్వం కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది.

నవంబర్ నెల నుంచి కిలో కందిపప్పును 67 రూపాయలకే అందించనున్నారు దీనితోపాటు చక్కర కిలో 14 రూపాయలకే అందించనున్నారు.

ప్రజల్లో వచ్చిన మార్పులు అనుగుణంగా రేషన్ కంపెనీలో చిరుధాన్యాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా రేషన్ షాపులకు జొన్నలు రాగులు సజ్జలను పంపిణీ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నది.

ఇప్పటికే వంటనూనెల్ని తక్కువ ధరకే అందించిన విషయం తెలిసిందే.

Click here to Share

You cannot copy content of this page