ఏపీలో ఆశావర్కర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆశావర్కర్లకు గ్రాట్యుటీ చెల్లింపునకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు జీతంతో పాటు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌కు కూడా అంగీకారం తెలిపారాయన. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి చూసేయండి.
ఆశా వర్కర్లకు అద్దిరిపోయే న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. గ్రాట్యుటీ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే… రిటైర్మెంట్ ఏజ్ పెంచేశారు. ఎన్నికల టైమ్‌లో ఆశా వర్కర్లకు కీలక హామీలిచ్చారు చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే… గ్రాట్యుటీతో పాటు రిటైర్మెంట్ ఏజ్‌ను కూడా పెంచుతామన్నారు. ఆ హామీలనే అమలు చేయబోతున్నామంటూ ఆశా వర్కర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు చంద్రబాబు. ఆశా కార్యకర్తల పదవి విమరణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. 180 రోజుల మెటర్నిటీ లీవ్‌కు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మెటర్నిటీ లీవ్ సమయంలో జీతం కూడా ఇవ్వనున్నారు.
ఇటు ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42వేల 752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37వేల 17 మంది, పట్టణాల్లో 5వేల 735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10వేల రూపాయల వేతనం పొందుతున్నారు. ఇక సర్వీస్ పూర్తయ్యేనాటికి గ్రాట్యూటీ లాంటి బెనిఫిట్స్‌తో ప్రతిఒక్కరికి లక్షన్నర మేర లబ్ధి చేకూరనుంది. ఇటు ప్రభుత్వ నిర్ణయంతో ఆశా వర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెటర్నిటీ లీవ్ ఇవ్వడం.. ఆ లీవ్ సమయంలోనూ శాలరీ ఇస్తామని ప్రకటించడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవ్. ఇచ్చినమాట నిలబెట్టుకున్నారంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు
➜ గ్రాట్యుటీ చెల్లింపునకు సీఎం గ్రీన్ సిగ్నల్
➜ ఒక్కొక్కరికి రూ.లక్షన్నర మేర లబ్ధి
జీతంతో పాటు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌కు అంగీకారం
➜ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
➜ ఏపీలోని 42,752 మంది ఆశావర్కర్లకు లబ్ధి….
Leave a Reply