AP Fee Reimbursement Arrear 2023-24 Payment Update 2025 – విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్లు తీసుకురావడం జరిగింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ AP Fee reimbursementబకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించేందుకుగాను ప్రజల నుండి సమాచారాన్ని గ్రామ / వార్డు సచివాలయాల నుండి తీసుకోవడం ప్రారంభించింది. 2023-24 విద్యా సంవత్సరంలో కాలేజీకు పేమెంట్ చేసిన వారికి ఈ ఆప్షన్ ద్వారా నగదు అందుతుంది. పేమెంట్ చేసిన వారికి నగదు అందుతుందా లేదా? అందితే ఎలా అందుతుంది ? ఆ నగదు ప్రభుత్వం కాలేజీ ఖాతాలో జమ చేస్తే మాకు నగదు ఎవరిస్తారు ? అనే ప్రశ్నలతో ఇంతకాలం ఉన్న ప్రజలకు ఈ ఆప్షన్ ద్వారా ఒక ఊరట వచ్చింది .
ప్రజల నుండి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్మెంట్ AP Fee Reimbursement బకాయిల చెల్లింపు ప్రక్రియలో భాగంగా ఎవరైతే కాలేజీకి బకాయిలు చెల్లించి ఉంటారో వారి వద్ద నుండి రసీదులను పొంది ఆ నగదును నేరుగా తల్లుల ఖాతాలో / జాయింట్ ఖతా లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కాలేజీకు నగదు పేమెంట్ చేయనివారు కూడా ఈ సర్వేలో వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అటువంటి వారి తరపున కాలేజీ బ్యాంకు ఖాతాకు నేరుగా ప్రభుత్వం నుండి నగదు అందుతుంది. ఈ వివరాలను తెలుసుకునేందుకుగాను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయంలో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అదే వార్డు సచివాలయంలో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి జ్ఞానభూమి మొబైల్ యాప్ లాగిన్ నందు కొత్తగా Jnanabhumi App – Arrear Survey 2023-24 [ AP Fees Reimbursement ] ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
విద్యార్థులు లేదా వారి తల్లులు వారి సొంత గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి పైన చెప్పిన అధికారులను కాంటాక్ట్ అయినట్లయితే వారు వారి లాగిన్ లో విద్యార్థి పేరుపై క్లిక్ చేసి విద్యార్థి వివరాలన్నీ కూడా మీకు తెలియజేసి అందులో మీరు2023-24 సంవత్సరానికి సంబంధించి ఎటువంటి AP Fee Reimbursement బకాయిలను పేమెంట్ చేశారా చేయలేదా అనే ప్రశ్న అడుగుతుంది. బకాయిలు పేమెంట్ చేయకపోతే చేయలేదు అని చెప్పి సెలెక్ట్ చేసి తల్లి లేదా విద్యార్థి బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేస్తే అంతటితో వారికి ఆ సర్వే పూర్తి అవుతుంది.
అదే AP Fee Reimbursement బకాయిల పేమెంట్ చేశారు అని చెప్పినట్టయితే అప్పుడు పూర్తిగా పేమెంట్ చేశారా లేదా కొంతవరకు మాత్రమే పేమెంట్ చేశారా అనే ప్రశ్నలు అడుగుతుంది. పూర్తిగా పేమెంటు చేసినట్లయితే పేమెంట్ కు సంబంధించినటువంటి రసీదులు, పేమెంట్ చేసిన తేదీ, పేమెంట్ రసీదు యొక్క ఫోటోను తీసుకొని వారి వివరాలను ఉద్యోగుల లాగిన్ లో అప్లోడ్ చేసి చివరగా విద్యార్థి లేదా విద్యార్థి తల్లి యొక్క బయోమెట్రిక్ తీసుకొని వారికి సర్వే పూర్తి చేస్తారు. ఎన్ని రసీదులుంటే అన్ని రసీదులు అప్లోడ్ చేస్తారు కావున విద్యార్థి లేదా విద్యార్థి తల్లి తప్పనిసరిగా మీ వద్ద ఉన్న ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిల పేమెంట్ కు సంబంధించి అన్ని రసీదులను కూడా సచివాలయానికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
విద్యార్థి చనిపోయినట్టయితే విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేసి ఈ పూర్తి ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. AP Fee Reimbursement బకాయిల చెల్లింపుకు సంబంధించి రసీదు లేని పక్షాన అటువంటివారు కాలేజీని కాంటాక్ట్ అయినట్లయితే వారు ఒక నకలు అదే జిరాక్స్ ఇస్తారు దానిని తెచ్చినా కూడా సరిపోతుంది ఎటువంటి రసీదు లేకుండా పేమెంట్ చేశాము అంటే సచివాలయంలో అటువంటి వాటిని అప్లోడ్ చేయటానికి అవకాశం లేదు . తప్పనిసరిగా పేమెంట్ చేస్తే రసీదు అప్లోడ్ చేయాలి మరియు ఎంత నగదు కట్టారో ఆ నగదును ఎంటర్ చేయాలి, నగదు కట్టిన తేదీని కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆయా వివరాలు రసీదుపై తప్పనిసరిగా ఉండాలి .
ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో వివరాలను నమోదు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాడు ఆయా AP Fee Reimbursement బకాయిల విడుదలకు ప్రభుత్వం నగదు విడుదల చేస్తుంది అప్పుడు ఎవరైతే బకాయిలు సంబంధించి నగదు పేమెంట్ చేశారో ఆ నగదు పేమెంట్ అనేది విద్యార్థి యొక్క జాయింట్ ఖాతాలో జమ అవుతుంది జాయింట్ ఖాతా లేని పక్షాన ఆ సమయంలో మీరు ఏ బ్యాంకు ఖాతా ఇచ్చి ఉంటే ఆ బ్యాంకు ఖాతాలో నగదు అనేది జమ అవుతుంది ఇది కేవలం ఎవరైతే ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు పేమెంట్ చేసి ఉంటారు వారికి మాత్రమే ఎటువంటి బకాయిలు పేమెంట్ చేయని వారికి ఆయానగదు నేరుగా కాలేజీ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధంగా గత విద్యాసంవత్సరానికి సంబంధించి పూర్తి బకాయిల పేమెంట్ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది .
Arrear Survey 2023-24 [ AP Fee reimbursement ] Process
గ్రామ సచివాలయంలో WEA, వార్డు సచివాలయంలో WEDPS వారు ముందుగా కింద ఇవ్వబడిన మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని
వారి Jnanabhumi Web Site కు వాడే User Name & Password తో లాగిన్ అవుతారు అయిన వెంటనే హోం పేజీలో కింద చూపించిన చూపించినట్టుగా Option చూపిస్తుంది.

Not Surveyed Count పై క్లిక్ చేయాలి

విద్యార్థి పేరు పై క్లిక్ చేయాలి

విద్యార్థి వివరాలు అనగా విద్యార్థి పేరు, తల్లి పేరు, కాలేజీ పేరు, కోర్సు పేరు, కోర్సు సంవత్సరం, అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ తేదీ, కోర్సుకు సంబంధించి పూర్తి నగదు, మొదటి విడతలో విడుదలైన నగదు, ఇంకా విడుదల అవ్వాల్సిన బకాయి వివరాలు మొత్తం చూపిస్తుంది అక్కడే బకాయిల నగదు పేమెంట్ చేశారా లేదా అని అడుగుతుంది.

బకాయిల నగదు పేమెంట్ చేయలేదు అంటే మూడు ఆప్షన్లో చూపిస్తాయి
- Not Paid = రూపాయి కూడా పేమెంట్ చేయలేదు అన్నప్పుడు ఈ ఆప్షన్ ను
- Discontinued = కాలేజీ మధ్యలో కాలేజీ ని మానివేసినట్టయితే అప్పుడు ఈ ఆప్షను పిక్ చేస్తారు
- Student Death = విద్యార్థి చనిపోయినట్లయితే ఈ ఆప్షన్ను పిక్ చేస్తారు
మొదటి రెండు ఆప్షన్లో విద్యార్థి లేదా తల్లిలో ఎవరైనా సరే బయోమెట్రిక్ ద్వారా ధ్రువీకరణ వేయవచ్చు అదే చివరి ఆప్షన్ లో తప్పనిసరిగా తల్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వారికి ఈ సర్వే పూర్తి అవుతుంది

విద్యార్థి బకాయిలలో ఎంతైనా నగదు పేమెంట్ చేసి ఉంటే అప్పుడు కింద చూపించినట్టుగా ప్రాసెస్ ఉంటుంది బకాయిల పేమెంట్ కు సంబంధించి రసీదులకు సంబంధించి పేమెంట్ చేసిన నగదు పేమెంట్ చేసిన తేదీ రసీదు ఫోటోను తీసి అప్లోడ్ చేస్తారు ఇలా ఎన్ని రసీదులు ఉంటే అన్ని రసీదులకు ఫోటోలు అప్లోడ్ చేసి చివరగా ధ్రువీకరణలో తల్లి లేదా విద్యార్థి యొక్క బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా సబ్మిట్ చేస్తారు.

చివరగా సర్వే పూర్తయినట్టు అయితే కింద చూపించినట్టుగా ఉద్యోగుల లాగిన్ లో మెసేజ్ వస్తుంది ఇలా వచ్చిందంటే వారికి సర్వే పూర్తి అయింది అని అర్థము.

Leave a Reply