ఏపీలో కళాశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ (fees reimbursement amount released) నిధులు 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
ఇప్పటికే గత విద్యా సంవత్సరానికి సంబంధించి 778 కోట్లు చెల్లించినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. దీనికి అదనంగా ప్రస్తుతం 600 కోట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ బకాయిలు కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇక పెండింగ్ ఉన్నటువంటి 400 కోట్లు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు కోన శశిధర్ వెల్లడించారు.
విద్యార్థులను ఫీజ్ కోసం ఒత్తిడి చేస్తే చర్యలు
కళాశాల యాజమాన్యాలు ఎవరు కూడా విద్యార్థులను ఫీజ్ చెల్లించాలని ఒత్తిడి చేయరాదని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫీజు చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి ఉండకూడదని పేర్కొంది. ఎవరైనా విద్యార్థులని ఇబ్బంది పెట్టినా లేదా హాల్ టికెట్లు నిలిపివేసినా, ఇంకా ఏదైనా చర్యలకు పాల్పడినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. దశల భారీగా అన్ని విద్యా సంస్థలకు పూర్తి ఫీజు చెల్లింపులు చేపడుతున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే అయితే అప్పట్లో నేరుగా విద్యార్థులకు ఖాతాల్లో అమౌంట్ వేసేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నేరుగా కళాశాలలకే సెటిల్మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.
|ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ చేయండి
Leave a Reply