AP ELECTRICITY : ఏప్రిల్ నుంచి ఏపి లో విద్యుత్ ధరలు షాక్ ఇవ్వనున్నాయా? బిగ్ అప్డేట్

AP ELECTRICITY : ఏప్రిల్ నుంచి ఏపి లో విద్యుత్ ధరలు షాక్ ఇవ్వనున్నాయా? బిగ్ అప్డేట్

ఏపి లో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవుననే చెప్పాలి.

మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న డిస్కంలు ఒక్క సారిగా వినియోగదారులకు షాక్ ని ఇచ్చాయి.

ఏప్రిల్ 2023 నుంచి ఇందన సర్దుబాటు చార్జీలు ( true – up ) చార్జీల ను ఇక పై విద్యుత్ వినియోగ దారుల నుంచి నేరుగా వసూలు చేయాలని విద్యుత్ నియంత్రణ మండలి APERC డిస్కంల ను ఆదేశించింది.

ఈ మేరకు ఫ్యూయల్ & పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ లో APERC అనుమతించిన దాని కంటే ఇంధన ధరలు, బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు కు అదనంగా చేసిన ఖర్చు ను ఆ మరుసటి నెల లో బిల్లుల నుంచి వసూలు చేయాలి.

ఈ అమౌంట్ ను యూనిట్ కి 50 పైసలు వరకు వసూలు చేసుకోడానికి APERC అనుమతించింది. అంతకు మించితే true up మొత్తంలో సర్దుబాటు కు అవకాశం కల్పించడం జరిగింది. అది కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించేలా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తద్వారా ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మీ విద్యుత్ వినియోగం మరియు బిల్ వివరాలు కింది లింక్స్ ద్వారా చెక్ చేయండి

You cannot copy content of this page