రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

ఏపి లో రిజిస్ట్రేషన్ శాఖలో ఈ స్టాంపింగ్ విధానానికి ఏపి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈరోజు తన క్యాంప్ కార్యాలయంలో ఈ కొత్త ఈస్టాంపింగ్ [e-stamping] విధానాన్ని సీఎం ప్రారంభించడం జరిగింది

ఇ–స్టాంపింగ్‌ అంటే ఎంటి? ప్రయోజనాలు

రిజిస్ట్రేషన్ శాఖలో తప్పుడు స్టాంప్ పేపర్లు లేదా తప్పుడు ధృవ పత్రాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఈ స్టాంపింగ్ అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాలకు ఈ స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మరియు సర్ చార్జీలను పౌరులందరూ చెల్లించవచ్చు. వీటివల్ల అక్రమాలకు తావు లేకుండా మరింత పటిష్టమైన, సురక్షితమైన క్రయ విక్రయాలు నిర్వహించవచ్చు.

స్టాంప్‌ మరియు రిజిస్ట్రేషన్‌ శాఖ సెంట్రల్‌ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని అందిస్తుంది.

ఈ విధానం కోసం www.shcilestamp.com వెబ్‌సైట్‌లో మరియు ఇ–స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇ–స్టాంపులు ఆన్‌లైన్‌లో దృవీకరించుకోవచ్చు. తద్వారా నకిలి స్టాంపులను అరికట్టవచ్చు.నగదు,చెక్కు,ఆన్‌లైన్‌ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ,ఆప్కాబ్, యూనియన్‌ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్‌ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్‌ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ ఈ స్టాంపింగ్ విధానం అందుబాటులో వచ్చింది.

త్వరలో మరో వెయ్యి కేంద్రాలకు ఈ సర్వీస్ ని పెంచనున్నారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page