ఏపి లో రబీ సీజన్ కి సంబంధించి రైతులు పండించిన ధాన్యాన్ని వచ్చే నెల అనగా ఏప్రిల్ 15 నుంచి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయ మరియు అనుబంధ శాఖలపై బుధవారం సచివాలయంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మేరకు రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
ఏ సీజన్ కి సంబంధించి ఆ సీజన్ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రబీ సీజన్ ధాన్యం సేకరణ ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు నష్టపరిహారం నివేదిక ఏప్రిల్ మొదటి వారానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతుల జాబితా ఏప్రిల్ రెండవ వారానికి సిద్ధం చేయాలని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
రబి సీజన్ కు సంబంధించి ఇప్పటికే 100 శాతం ఈ క్రాపింగ్ పూర్తి అయినట్లు అధికారులు ముఖ్యమంత్రి కి తెలిపారు. అదేవిధంగా 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా 10.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Leave a Reply