దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కోవిడ్ ఉదృతి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
సీఎం ద్వారా కీలక ఆదేశాలు ఇవే
రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులందరూ అన్ని విధాలుగా అప్రమత్తత తో ఉండాలని సీఎం ఆదేశించారు
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు
గ్రామాల్లో సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్నట్లయితే వారికి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు ఇచ్చేలా చూడాలని తెలిపారు.
ఇటీవల ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్ మరియు విలేజ్ క్లినిక్ వ్యవస్థ ద్వారా కోవిడ్ ను అడ్డుకునెలా నాణ్యమైన వైద్యం మరియు టెస్టింగ్ కిట్స్ , మందులు పంపించాలని సంబదిత అధికారులకు సూచించారు.
ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి వెరియంట్ల కు తగ్గట్టుగా మందులు మరియు టెస్టింగ్ ల్యాబ్ లు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా ఫీవర్ సర్వే నిర్వహించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేయడం జరిగింది.
విలేజ్ క్లినిక్స్ స్ధాయిలోనే ర్యాపిడ్ టెస్టులు చేసే వ్యవస్థ ఉంది, అక్కడ ఏమైనా నిర్దారణ అయితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాట్లు కూడా చేశామని అధికారులు వెల్లడించారు
Leave a Reply