ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం !

 ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం !

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం వివరాలు

ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్‌ మరో తీపికబురు చెప్పింది. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం తీసుకువచ్చింది. సచివాలయంలో ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా 49 అంశాల పై చర్చించారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకానికి శ్రీకారం చుట్టింది.

ఈ పథకానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరుస్తూ, UPSC లో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం అందించనుంది.

కేబినెట్‌ ఆమోదించిన నిర్ణయాలు ఇవే..

  • జీపీఎస్‌ బిల్లు అమలుకు ఆమోదం..
  • ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు ఆమోదం. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
  • జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్‌ ఆమోదం.
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
  • ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం.
  • ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం.
  • ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది.
  • ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్శిటీలతో టై అప్‌ ఉండేలా చట్ట సవరణ. దీనివల్ల జాయింట్‌ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుంది.
  • కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం
  • పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.  
  • అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం
  • దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.
  • భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page