AP Cabinet decisions : ఏపీ క్యాబినెట్ ఆమోదించిన కీలక అంశాలు ఇవే

AP Cabinet decisions : ఏపీ క్యాబినెట్ ఆమోదించిన కీలక అంశాలు ఇవే

మంగళవారం బడ్జెట్ ముందు జరిగిన క్యాబినెట్ సమావేశం లో 15 అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.ఇందులో గ్రామ వార్డు సచివాలయాకు చట్ట భద్రత , నైట్ వ్వాచ్ మెన్ నియామకాలు , వచ్చే నెల పెన్షన్ పంపిణి , ఎయిడెడ్ పాఠశాలల సిబ్బంది పదవీ విరమణ వంటి కెలక అంశాలకు ఆమోదం లభించింది.

క్యాబినెట్ కీలక నిర్ణయాలు మరియు ఆమోదించిన అంశాలు ఇవే

  • వచ్చే నెల అనగా ఏప్రిల్ నెల పెన్షన్ 1 వ తేదీ బదులు 3 వ తేదీ నుంచి పంపిణి చేయాలని నిర్ణయం.
  • ఏపీ లో గ్రామ వార్డు సచివాలయం చట్టబద్దత కై ప్రవేశ పెట్టబోతున్న బిల్లు – 2023 కు ఆమోదం
  • ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం, వీరితో పాటు జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును కూడా 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • రాష్ట్రంలో 5330 హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. వీరికి నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. అమ్మ ఒడి పథకం నిధుల్లో భాగంగా ప్రస్తుతం కట్ చేస్తున్న 2000 టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి వీరికి గౌరవ్ వేతనం చెల్లిస్తారు.
  • ఏపీఐఐసీ [APIIC ] చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్
  • అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం. ఇందులో పలు గ్రామాల విలీనం.
  • ఎక్సైజ్ చట్టం సవరణకు కూడా క్యాబినెట్ ఆమోదం
  • అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడి ని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కనీసం వంద పనిదినాలు పని చేసిన క్షురకులకు ఇది వర్తిస్తుంది.
  • పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్- 2023 సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

You cannot copy content of this page