సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటికి సమ ప్రాధాన్యమిస్తూ 15% వృత్తి రేటు సాధనే లక్ష్యంగా వార్షిక బడ్జెట్ రూపకల్ప పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సూపర్ సిక్స్ (super six schemes) హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టనుంది. వాటికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఏపి సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఇవే కాకుండా మత్స్యకారులకు రెట్టింపు చేసిన 20వేల రూపాయలను వేట నిషేధం సమయంలో వారి ఖాతాల్లో కూడా ప్రభుత్వం జమ చేయనుంది.
మొత్తంగా నాలుగు కీలక పథకాలకు వచ్చే నాలుగు నెలల్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు ముందుకు వచ్చింది. ఏప్రిల్ 15 లోపు మత్స్యకార భరోసా, మే లేదా జూన్ లో అన్నదాత సుఖీభవ, జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి తల్లికి వందనం ఇక ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలకు శ్రీకారం చుట్టనుంది.
![](https://studybizz.com/schemes/wp-content/uploads/2025/02/img-20250213-wa00006850244222602121112-1024x596.jpg)
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తుత బడ్జెట్ పై సమీక్ష జరిపారు. ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ముఖ్య మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా తీసుకు వెళ్లేలా చర్చించడం జరిగింది. అయితే అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది.
ఇప్పటికే అన్నా క్యాంటీన్లు, ఉచిత సిలిండర్, పెంచిన పెన్షన్ వంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరో నాలుగు పథకాలు అమలు చేస్తే అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో దూసుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో భారీ మొత్తంలో పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇవన్నీ కూడా త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీలో కూటమి సర్కార్ సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గాడిలో పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
Leave a Reply