AP Corporation Loans 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కులాలకు బీసీ కార్పొరేషన్ లోన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ లోన్లకు సంబంధించి AP OBMMS Web Site లో Online Application కు Option ఓపెన్ అయ్యింది . BC / EWS / OC Caste కు చెందిన Male & Female అందరు Apply చేసుకోవచ్చు. Apply చేసుకోవటానికి ఎటువంటి Application Fee లేదు..పూర్తిగా ఉచితం . AP Corporation Loans Apply చేసుకోవాటికి ఎవరికి వారు సొంతంగా AP OBMMS Site లో లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీయొక్క Grama Ward Sachivalayams నందు AP Corporation Loans కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు .
AP Corporation Loan Amount Details 2025
బీసీ కార్పొరేషన్ కింద అందించే మొత్తం రుణాన్ని మూడు స్లాబ్ కింద విభజించడం జరిగింది.
Slab | Unit Cost | Subsidy | Bank Loan | Total |
Slab-1 | Upto Rs.2.00 lakhs | 50% subject to a maximum of Rs.O.75 lakhs on the unit cost | 50°/o on the unit cost upto Rs.1.25 lakhs | Rs.2.00 lakhs |
Slab-2 | > Rs.2.00lakhs & < Rs.3.00 lakhs | 50°/n subject to a maximum of Rs.1.25 lakhs on the unit cost | 50°/n on the unit cost upto Rs.1.75 lakhs | Rs.3.00 lakhs |
Slab-3 | > Rs.3.00 lakhs &<Rs.5.00 lakhs | 50•10 subject to a maximum of Rs.2.00 lakhs on the unit cost | 50•10 on the unit cost upto Rs.3.00 lakhs | Rs.5.00 lakhs |
Slab 1:
మొదటి స్లాబ్ లో 2 లక్షల వరకు రుణాన్ని ఇస్తారు. ఇందులో 50 శాతం వరకు యూనిట్ కాస్ట్ పైన 75 వేల మించకుండా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ కాస్ట్ పై 50% మించకుండా 1 లక్ష 25 వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి లోన్ ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది .
Slab 2 :
స్లాబ్ 2 లో 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది రూ.1,25,000 సబ్సిడీ అందుతుంది అంటే వీటిపై ఎటువంటి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు యూనిట్ కాస్ట్ పై 50% అంటే రూ.1,75,000 వరకు బ్యాంకు నుంచి లోన్ అందుతుంది .
Slab 3 :
స్లాబ్ 3 లో 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. రూ.2,00,000 సబ్సిడీ అందుతుంది అంటే వీటిపై ఎటువంటి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు యూనిట్ కాస్ట్ పై 50% అంటే రూ.3,00,000 వరకు బ్యాంకు నుంచి లోన్ అందుతుంది . అన్ని బ్యాంకు లోన్లపై AP Corporation Loans 2025 Interest Rates వడ్డీ రూపాయి కన్నా [ 12% ] తక్కువే ఉంటుంది .
Eligibility Criteria for AP Corporation Loans 2025
Who Can Apply for AP Corporation Loans?
కింద తెలిపిన అర్హతలు ఉంటే సులువుగా AP Corporation Loans ని అందుకోవచ్చు
- ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి
- రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి
- 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
- ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి
- ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
- మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి
- చదువుతో సంబంధం లేదు. చదివితే పాస్ సర్టిఫికెట్ ఉంటె పెట్టవచ్చు , లేక పోతే లేదు .
- ట్రైనింగు / పథకము / సబ్సిడీ పొందు ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి
- మెడికల్ షాప్ కు పెట్టాలనుకుంటే డి ఫార్మసీ / బి ఫార్మసీ /ఎం ఫార్మసీలో ఏదైనా ఉండాలి
Required Documents for AP Corporation Loans 2025
- క్యాస్ట్ సర్టిఫికేట్
- రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- గతంలో ట్రైనింగు లేదా శిక్షణ పొందు ఉంటే ఆ సర్టిఫికెట్
- వాహన రంగ వ్యాపారానికి లేదా పనిని ప్రారంభించడానికి డ్రైవింగ్ లైసెన్సు
- మొబైల్ నెంబరు
- ఫార్మసీ సెక్టార్ కి సంబంధించి బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ సర్టిఫికెట్
AP Corporation Loans Category List 2025
ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ లోన్లు AP Corporation Loans 2025 కింద తెలిపిన 6 సెక్టార్లలో ఏదైనా పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది . 6 సెక్టార్ లో ఉన్నటువంటి వివిధ రకములైన పనులను కింద ఇవ్వటం జరిగింది ఒకసారి చూడండి అందులో మీరు దేని ప్రారంభించాలనుకుంటున్నారో దానిపై మీరు కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు
1.వ్యవసాయ రంగం :
- వ్యవసాయం దున్నడానికి యంత్రాలు & పనిముట్లు
- బండి & ఎద్దులు
- కంప్రెసర్ ట్రాక్టర్
- డ్రోన్ స్ప్రేయర్
- మినీ ట్రాక్టర్
- మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ
- మౌంటెడ్ స్ప్రేయర్
- బహుళ పంట త్రషర్
- ముష్రోమ్ సాగు యూనిట్
- ఆయిల్ ఇంజిన్ (20 HP)
- పవర్ ట్రిల్లర్
- రోటో వీడర్-(ఇంటర్ కల్టివేటర్)
- ట్రాక్టర్
- ట్రైలర్ తో ట్రాక్టర్
2.పశు సంపద రంగం :
- మిల్క్ కాటిల్
- పౌల్ట్రీ ఫారం
3.వ్యాపార రంగం:
- అడ్డా ఆకు తయారీ
- ఆటో మొబైల్ షాప్ (విడిభాగాలు)
- బ్యాటరీ యూనిట్
- పుస్తకాల బైండింగ్ పనులు
- పుష్పగుచ్ఛాలు & దండల వ్యాపారం
- బోటిక్ / ఫ్యాషన్ డిజైనింగ్
- ఇటుకల వ్యాపారం
- కేబుల్ / రాగి వ్యర్థాలు మరియు స్క్రాప్ వ్యాపారం
- చెరకు యూనిట్లు
- సిమెంట్ & ఇనుము దుకాణం
- చప్పల్స్ / షూ మార్ట్
- వస్త్ర వ్యాపారం
- కొబ్బరి వ్యాపారం
- కొబ్బరి మాత్రికల తయారీ
- కాంక్రీట్ మిల్లర్
- సైకిల్ దుకాణం & మరమ్మత్తు
- డ్రై ఫ్రూట్స్ వ్యాపారం
- ఫ్యాన్సీ & జనరల్ స్టోర్
- ఫిషింగ్ బోట్లు
- ఫిషింగ్ నెట్స్
- చేపలు (నిల్వ) అమ్మే దుకాణం
- ఫ్లెక్సీ & ప్రింటింగ్
- ఫోమ్ మాత్రికలు
- ఫర్నిచర్ దుకాణం
- జనరల్ స్టోర్ & కిరణా దుకాణం
- గాజు అలంకరణ – కటింగ్
- గన్నీ బ్యాగుల వ్యాపారం
- చేనేత & నూలు యూనిట్
- ఐస్ క్రీమ్ పార్లర్
- గుర్తింపు కార్డులు, బ్యాగులు & బెల్టుల తయారీ
- ఐరన్ బీరువా తయారీ యూనిట్
- ఇనుప గేట్ల తయారీ
- జ్యూస్ దుకాణం
- జనపనార సంచుల తయారీ
- కిరాణా / పాన్ షాప్
- లాండ్రీ దుకాణం
- మినీ హోటల్
- మినీ పవర్ లూమ్ మెషిన్ యూనిట్
- మినీ సూపర్ మార్కెట్
- మొబైల్ సేల్స్ మరియు సర్వీసింగ్ సెంటర్
- మటన్/ చికెన్ షాప్
- ఆప్టికల్ షాప్
- పెయింట్ దుకాణం · పెయింటింగ్ పనులు
- పేపర్ బ్యాగుల తయారీ
- పికెల్ & పాపడ్ తయారీ
- పివిసి పైపులు & ప్లంబింగ్ మెటీరియల్స్
- బియ్యం వ్యాపారం
- ఉప్పు తయారీ యూనిట్
- స్లాబ్ కటింగ్ మెషిన్
- సోడా తయారీ యూనిట్
- స్టేషనరీ పుస్తక దుకాణం
- స్టీల్ ఫర్నిచర్ దుకాణం
- స్టోన్ క్రషర్
- టెంట్ హౌస్/షామియానా
- ట్రంక్ బాక్స్ తయారీ
- కూరగాయలు & పండ్ల దుకాణం
- వర్మీకంపోస్ట్ యూనిట్
- వెల్డింగ్ దుకాణం
- చెక్క పనిముట్లు
4.పరిశ్రమల రంగం :
- కమ్మరి
- ఇటుక తయారీ / ఫ్లై యాష్ ఇటుకలు
- ఆధునిక & అధునాతన యంత్రాలతో వడ్రంగి పని
- జీడిపప్పు / ప్రాసెసింగ్ (డ్రై ఫ్రూట్స్)
- సిమెంట్ ఇటుకలు Mfg.
- సిమెంట్ మిక్సర్ మెషిన్/మిల్లర్
- ఇనుప పలకలతో కేంద్రీకరణ పదార్థం
- చిక్కీ Mfg.
- డిస్టిల్డ్ వాటర్ తయారీ యూనిట్
- ఇంజనీరింగ్ వర్క్‌షాప్ (లేత్ వర్క్స్)
- ఫ్యాబ్రికేషన్ వర్క్స్
- ఫ్లోర్ మిల్లు
- స్వర్ణకారుడు(స్వర్ణకర)
- గ్రానైట్ స్టోన్/మార్బుల్స్ పాలిషింగ్ & అమ్మకం యూనిట్
- ఇనుప అల్మారాలు / లాకర్ల తయారీ
- మామిడి జెల్లీ తయారీ
- చిప్స్ తయారీ (అరటి/బంగాళాదుంప)
- పాలీ బ్యాగులు మొదలైన వాటి యొక్క Mfg.,
- ఎంఎస్ గ్రిల్స్ (ఇనుము / ఉక్కు) / వెల్డింగ్ పనులు
- నూడుల్స్ తయారీ
- పేపర్ ప్లేట్లు & డిస్పోజబుల్ పేపర్ గ్లాసెస్ తయారీదారులు
- దిండ్లు & పడకల తయారీ యూనిట్ (పరుపులు)
- పోహా / పాప్‌కార్న్ తయారీ
- కుండల తయారీ
- రెడీమేడ్ దుస్తుల తయారీ
- RO వాటర్ ప్లాంట్
- చీర రోలింగ్ / ఫాబ్రిక్ పెయింటింగ్
- స్లాబ్ కటింగ్ మెషిన్
- స్టీల్ / వెల్డింగ్ దుకాణం
5.సేవా రంగం :
- 2 వీలర్ మరమ్మతు
- 4 వీలర్ మరమ్మతు
- AC & ఫ్రిజ్ మరమ్మతు దుకాణం
- ఆటో సర్వీస్ సెంటర్
- బేకరీ ఉత్పత్తుల దుకాణం
- బ్యాండ్ సెట్ యూనిట్
- క్షౌరశాల
- బ్యాటరీ సర్వీసింగ్ దుకాణం
- బ్యూటీ పార్లర్లు & స్పా / ఆధునిక బ్యూటీ సెలూన్లు
- బుక్ స్టాల్
- బ్రాస్ స్మిత్
- కేబుల్ టీవీ నెట్‌వర్క్
- క్యాటరింగ్ యూనిట్
- సెల్ ఫోన్ మరమ్మతు దుకాణం
- చెక్కతో మెట్రియల్‌ను కేంద్రీకరించడం
- కంప్యూటర్ డిటిపి & జిరాక్స్ సెంటర్
- కంప్యూటర్ హార్డ్‌వేర్ దుకాణం
- పాల ఉత్పత్తుల దుకాణం
- డ్రై ఫ్రూట్స్ అమ్మే దుకాణం
- గుడ్డు వ్యాపారం
- ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ మరమ్మతు దుకాణం
- ఎంబ్రాయిడరీ పని
- పండ్లు & కూరగాయలు అమ్మే దుకాణం
- గాజు అలంకరణ-కటింగ్
- మెకానిక్ షాప్
- మైక్ సెట్/ సౌండ్ సిస్టేమ్
- మోడరన్ డ్రై క్లీనింగ్ షాప్
- మోడరన్ సెలూన్
- ఫోటో ఫ్రేమింగ్ / ఫోటో స్టూడియో/డ్రోన్ కెమెరాలు
- ప్లంబింగ్ పనులు
- చీర పాలిషింగ్, రోలింగ్ & డ్రై క్లీనింగ్
- స్క్రీన్ మరియు ఆఫ్‌సెట్ ప్రింటింగ్
- సోఫా తయారీ మరియు మరమ్మతు పని
- స్టిక్కరింగ్ పని
- టాడీ ట్యాపింగ్
- గడియారం మరమ్మతు
6.వాహన రంగం :
- రవాణా
- ఈ-ఆటోలు (3 వీలర్లు)
- ఇ-ట్రక్
- మినీ వ్యాన్ (ప్యాసెంజర్ / ట్రక్)
- మినీ వ్యాన్లు (లగేజీ క్యారియర్లు)
- ప్యాసింజర్ ఆటో / ట్రక్ ఆటో (డీజిల్)
Process of AP Corporation Loans 2025

దరఖాస్తు చేయాలనుకునే వారు ఆన్లైన్ లో కింద తెలిపిన AP Corporation Loans 2025 Application Online Process విధంగా మొదట దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ అన్నీ కూడా, గ్రామాల్లో అయితే MPDO వారికి పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ MC వారి వారి లాగిన్ కు వెళ్లడం జరుగుతుంది. అక్కడే అప్లికేషన్ ఆమోదించడమో లేదా తిరస్కరించడం AP Corporation Loans Approve or Reject అనేది జరుగుతుంది. తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ DBSCSC వారి ఆమోదం కు వెళ్తుంది. తుది ఆమోదం కొరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ వారికి వెళ్తుంది. అదేవిధంగా సమాచార నిమిత్తం మరియు శాంక్షన్ కొరకు VS & MD APBCCFC వారి లాగిన్ కు వెళ్లడం జరుగుతాయి. సాంక్షన్ అయిన తర్వాత సంబంధిత సబ్సిడీ నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతుంది మిగిలిన నగదు కొరకు లబ్ధిదారులు తప్పనిసరిగా ఏ బ్యాంకు వివరాలను ఇస్తారో ఆ యొక్క బ్యాంకుకు వెళ్లి లోన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది .
How to Apply for AP Corporation Loans 2025
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి .
Step 2 : కింద చూపించినట్టుగా For Registration అనే ఆప్షన్ పెట్టి చేయండి.

Step 3 : Basic Details లో

- జిల్లా పేరు
- ఆధార్ నెంబరు
- మొబైల్ నెంబరు
- దరఖాస్తుదారిని పూర్తి పేరు [ As Per Aadhaar ]
- తండ్రి లేదా భర్త లేదా సంరక్షకుల పేరు
- లింగము
- పుట్టిన తేదీ [ As Per Aadhaar ]
- కులము [ As Per Certificate ]
- ఉపకులము
నమోదు చేసి Generate OTP పై క్లిక్ చేసినట్లయితే పైన మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 8 అంకెల ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేసి తర్వాత పేజీ కు వెళ్లాలి.
Step 4 : రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టు కింద చూపించినట్టుగా చూపిస్తుంది User ID గా మొబైల్ నెంబర్ ఉంటుంది ,Password ను మీరు Forget Password ద్వారా మార్చుకోవచ్చు లేదా నేరుగా లాగిన్ పేజీ కు వెళ్తుంది .

Step 5 : Candidate Details లో

Caste Certificate నెంబరు నమోదు చేసి Get Details పై ఎంటర్ చేసినట్లయితే పేరు, కులము, ఉప కులము వివరాలు వస్తాయి. Ration Card Number / Rice Card Number రేషన్ కార్డు నెంబరు నమోదు చేసి రేషన్ కార్డును PDF కానీ ఫోటో రూపంలో గానీ అప్లోడ్ చేయాలి. వివాహం చేసుకున్నట్లయితే వివాహం చేసుకున్నారని నమోదు చేయాలి. వికలాంగులు అయితే వికలాంగులుగా నమోదు చేస్తూ ఎటువంటి వికలాంగులు నమోదు చేస్తూ % ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి .
చదువుకోకపోతే చదువుకోలేదు అని చెప్పి సెలెక్ట్ చేయాలి చదువుకున్నట్లయితే ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఏ జిల్లాలో పాస్ అయ్యారు, అనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది సర్టిఫికెట్ అందుబాటులో ఉంటే అప్లోడ్ చేయొచ్చు అందుబాటులో లేకపోతే అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు . తరువాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ కింద చిరునామా వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుత జిల్లా ప్రస్తుత మండలం ప్రస్తుత గ్రామం ప్రస్తుత పిన్కోడు ప్రస్తుత డోర్ నెంబరు ప్రస్తుత పూర్తి చిరునామాలు నమోదు చేసి Save & Continue పై క్లిక్ చేయాలి .
Step 6 : Eligible Scheme లో Main Scheme వద్ద Self Employment Schemeను సెలెక్ట్ చేసుకుని Sector లో పైన తెలిపిన వాటిలో మీరు ఏ వ్యాపారాన్ని లేదా పనిని ప్రారంభించాలో ఆ యొక్క Sector సెలెక్ట్ చేసుకొని Schemeసెలెక్ట్ చేసుకొని Unit Cost కింద మీకు వ్యాపార ప్రారంభానికి అవసరమయ్యే మొత్తం నగదును 5 లక్షలకు మించకుండా ఎంటర్ చేసి Eligible Criteria కింద ఎప్పుడైనా సరే ట్రైనింగ్ తీసుకున్నట్లయితే తీసుకున్నట్టు చెక్ చేసి సంబంధిత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి గతంలో ఎప్పుడైనా మీరు ఇటువంటి పథకాన్ని పొందినట్లయితే No అని సెలెక్ట్ చేయాలి పొందకపోతే YESసెలెక్ట్ చేయాలి తరువాత గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి లేదా కార్పొరేషన్ ద్వారా ఇటువంటి లోన్లు తీసుకున్నారని అడుగుతుంది తీసుకోకపోతే NO తీసుకుంటే YES అని సెలెక్ట్ చేసి Save & Continu పై క్లిక్ చేయాలి .

Step 7 : Preview లో ఇప్పటివరకు నమోదు చేసిన అన్ని వివరాలను సరి చూసుకున్న తర్వాత Submit పై క్లిక్ చేయాలి.

Step 8 : Print పై క్లిక్ చేసి మసీదును లేదా అప్లికేషన్ను పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి

ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు లేదా రైస్ కార్డు జిరాక్స్, అప్లికేషన్ ఫారం [ ఇప్పుడు ప్రింట్ తీసుకున్నది ], కుల దృవీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రము వీటన్నిటితో సంబంధిత MPDO లేదా MC వారి ఆఫీసులో సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ చేయు ప్రాసెస్ పూర్తి అయినట్టు అర్థం
Leave a Reply