మహిళా శిశు సంక్షేమ శాఖ పై గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీలు, నాడు నేడు మరియు సంపూర్ణ పోషణ పథకాల పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది.
అంగన్వాడీలలో నాడు నేడు పనులకు సంబంధించి ఆరా తీసిన ముఖ్యమంత్రి పదివేల అంగన్వాడీలో ప్రస్తుతం పనులు జరుగుతుండగా మిగిలిన 45 వేల అంగన్వాడీల లో కూడా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు.
అంగన్వాడీలలో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి ఇంకా ఏ సదుపాయాలు కావాలి అనే అంశంపై గ్రామ వార్డు సచివాలయం ద్వారా డేటా సేకరణ చేయాలని సూచించారు.
అంతేకాకుండా పిల్లల ఎదుగుదలకు సంబంధించి గ్రోత్ మానిటరింగ్ పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీల పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇక అంగన్వాడీలలో సంపూర్ణ పోషణ పథకం నిక్కచ్చిగా ఉండాలని, పెన్షన్ పంపిణీ ఎంత కరెక్ట్ గా ఉంటుందో అంతే కరెక్ట్ గా సంపూర్ణ పోషణ పంపిణీ కూడా ఉండాలని ఆదేశించారు.
అంగన్వాడీలలో ఖాళీగా ఉన్నటువంటి వర్కర్లు సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది.
అంతేకాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని సీఎం అధికారులను కోరారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలలో జిల్లాల వారీగా ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం మిగిలిన ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేయనుంది.
Leave a Reply