అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ కింద 98% మంది అనగా 47.77 లక్షల మంది రైతులు కేవైసీ పూర్తి చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు.
ఇంకా 60 వేల మంది కి కేవైసీ పెండింగ్
ఇంకా 60000 మంది కేవైసీ చేయాల్సి ఉంది అని ఆయన తెలిపారు. సొంత భూమి కలిగినటువంటి ఢీ పట్టాదారులు, అసైన్డ్, ఈనాం భూములు కలిగిన వారిని కూడా అర్హులుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు.
కేవైసీ ఎవరికైతే ఇంకా పెండింగ్ ఉందో అటువంటి వారి మీ సమీప రైతుకే సేవా కేంద్రంలో సంప్రదించి కేవైసీ అనగా థంబ్ వేయవచ్చు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కి సంబంధించి పూర్తి లబ్ధిదారుల జాబితా రైతు సేవ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచడం జరిగింది.
వెబ్ ల్యాండ్ లో ఆధార్ లేకుంటే
రైతులు ఎవరికైతే తమ భూమికి సంబంధించి వెబ్ ల్యాండ్ లో ఆధార్ జతకాలేదో అటువంటివారు, ఇంకా ఎవరికైతే తప్పుగా నమోదయిందో అటువంటివారు, మరణించిన ఖాతాలు నోషనల్ ఖాతాలు ఉన్న వారందరూ కూడా మీ యొక్క రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఇక అన్నదాత సుఖీభవ అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ జమ అయిన వెంటనే అదే రోజున జమ చేయడానికి సిద్ధంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడుతుంది
పీఎం కిసాన్ 20వ విడత అమౌంట్ జూలై మొదటి వారంలో జమ అయ్యే ఆస్కారం ఉంది. మూడు విడతల్లో 20000 రూపాయలు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి.
కౌలు రైతులకు రెండు విడతల్లో
భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తెలిపారు. కౌలు రైతులకు మాత్రం అక్టోబర్ మరియు జనవరి నెలలో అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది.
అన్నదాత సుఖీభవ ప్రత్యేక పోర్టల్!
అన్నదాత సుఖీభవ రైతుల విజ్ఞప్తుల మేరకు త్వరలో పోర్టల్ లో అన్ని వివరాలు, స్టేటస్ సరి చూసుకునే ఆప్షన్ ఎనేబుల్ చేస్తామని వ్యవసాయ శాఖ పేర్కొంది.
3 responses to “అన్నదాత సుఖీభవ 98% కేవైసీ పూర్తి, అమౌంట్ ఎప్పుడంటే, కౌలు రైతులు ఏం చేయాలి!”
సర్ మేము కొత్తగా 39 సెంట్లు పొలం కొన్నాము.కానీ ఇంకా పాస్ పుస్తకం రాలేదు.మరి మేము పి ఎం కిసాన్ కి అప్లై చేసుకొనే అవకాశం ఉందా లేదా తెలుపగలరు
Amount eppudu credit avuthondhi
Na name taxable ani vachhindi 2020lo loanki tax paychesam next year close chesamu aday chupistunnadhi