ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమౌంట్ గత నెలలో జమ చేయలేదు. అటువంటి వారందరికీ ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పెండింగ్ అమౌంట్ (annadata sukhibhava pending amount) విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ వంటి సమస్యలు పరిష్కరించబడిన వారందరికీ కూడా ప్రస్తుతం అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
1,42,765 మంది రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ జమ
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా 1,04,107 మంది ఖాతాలో అన్నదాత సుఖీభవ అమౌంటును ప్రభుత్వం తాత్కాలికంగా పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులకు తాజాగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 5వేల రూపాయలను జమ చేసింది. వీరికి ఇప్పటికే పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు జమ చేయడం జరిగింది.
వీరితోపాటు ఈ కేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసుకున్న మరో 38,658 మందికి కూడా రూ.5,000 చొప్పున విడుదల చేయడం జరిగింది.
వీరందరికీ అమౌంట్ ను బుధవారం విడుదల చేయగా గురువారం నాటికి అందరి ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది.
అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ ని సులభంగా చెక్ చేయవచ్చు.
ఆన్లైన్లో అన్నదాత సుఖీభవ పడిందా లేదా, ఏ బ్యాంకు ఖాతాకు పడింది అనే అంశాలను కింద ఇవ్వబడిన లింక్ లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సులభంగా చెక్ చేయవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ దశలో భాగంగా మొత్తం రూ.71.38 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది.

Leave a Reply