ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రభుత్వం పేర్కొన్నటువంటి ఆరు అంచెల ధ్రువీకరణను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
వీటిలో ఆరు అంశాలు ఏంటంటే : భూమి లేదా ఆస్తి, కుటుంబ ఆదాయం, ఫోర్ వీలర్, విద్యుత్ వినియోగం, కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారు.
ప్రభుత్వ పథకాలకు సాధారణ అర్హతలు
✓ కుటుంబా ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెల పదివేల రూపాయలు మించరాదు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతినెల 12 వేల రూపాయలు మించరాదు
✓ మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి భూమి మెట్ట భూమి అయితే పది ఎకరాల లోపు, మాగాణి అయితే మూడు ఎకరాలలోపు ఉండాలి. రెండు కలిపి కూడా 10 ఎకరాలకు మించి ఉండకూడదు.
✓ మున్సిపాలిటీ ప్రాంతాల్లో వేయి చదరపు అడుగుల మించి ఎటువంటి ఆస్తి లేదా ప్రాపర్టీ ఉండరాదు.
✓ విద్యుత్ వినియోగం 3 యూనిట్లు ప్రతినెల గత 12 నెలల కాలంలో మించి ఉండకూడదు.
✓ కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వ్యక్తులు ఉండకూడదు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది.
✓ కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు.
✓ కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండకూడదు
మరి మీకు పైన పేర్కొన్న అంశాలకి సంబంధించి అర్హత ఉందా లేదా చెక్ చేసుకునేందుకు కింది లింక్ పై క్లిక్ చేయండి
Leave a Reply