రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుక ప్రకటించింది.
అర్చకులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల లో భాగంగా ఇచ్చినటువంటి హామీ ని ప్రస్తుతం నెరవేర్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలో 1177 మంది అర్చకులకు కనీస వేతనం 15625 కి పెంచుతూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పెంపు కి సంబంధించి అర్చక సమాఖ్య సంతోషం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పై ఇప్పటి వరకు అమలు చేయని ప్రభుత్వం చివరి ఏడాది లో ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ప్రస్తుతం 10 వేలు వేతనం ఇస్తుండగా ఒకేసారి ఈ వేతనాన్ని 15625 కి పెంచడం జరిగింది. ఇక అర్చకులకు ఆయా దేవాలయాల పరిధిలోనే స్థలాలు కూడా కేటాయించనున్నట్లు ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. త్వరలో దీనిపై కూడా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
విజయదశమి నవరాత్రుల సందర్భంగా ఈ నెల 20 న ముఖ్యమంత్రి ఇంద్రకీలద్రిపై పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించనున్నారు.
Leave a Reply