ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వంద శాతం రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేస్తోంది. నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తే లాభాలు పొందవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాకుండా, ఎరువులు మరియు ఇతర అవసరాల కోసం హెక్టారుకు రూ.5,250 సాయం అందిస్తారు. ఈ సాయాన్ని నాలుగేళ్ల పాటూ ఇస్తారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. వీటితో పాటుగా ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన యంత్రాలను కూడా రాయితీపై అందిస్తారు. వీటిలో మినీ ట్రాక్టర్ ట్రాలీ, గెలల్ని కట్ చేసే కత్తులు, చాప్ కట్టర్లు ఇస్తారు.
ఏపీ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి రైతుల కోసం వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తోంది. ఆయిల్ పామ్ మొక్కులు వేసిన తర్వాత నాలుగో ఏడాది నుంచి పంట చేతికి వస్తుంది.. అలా 25 ఏళ్ల పాటూ దిగుబడి ఉంటుంది. ఆయిల్ పామ్ పంట మార్కెట్లో టన్ను ధర రూ.18వేల 500 నుంచి రూ.19వేల వరకు ఉంటుంది. అటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా వంట నూనె కొరతను తీర్చే దిశగా ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తోంది. అలాగే మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. రైతుల నుంచి ఈ ఆయిల్ పామ్ గెలల్ని పతంజలితో పాటుగా గోద్రేజ్ కంపెనీ కొనుగోలు చేస్తోంది.
Leave a Reply