ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.. మొదటి సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు బుక్ చేసుకున్నందుకు అవకాశం కల్పించగా, రెండవ సిలిండర్ రాయితీని పొందటానికి సదరు లబ్ధిదారుడు ఏప్రిల్ నుంచి జూలై లోపు చేసుకోవాల్సి ఉంటుంది.
రెండవ సిలిండర్ రాయితీ పొందటానికి జూలై 31 లాస్ట్ డేట్
రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి ఏప్రిల్ నుంచి జూలై 31 లోపు సదరు లబ్ధిదారుడు సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకున్న 48 గంటల్లో లబ్ధిదారుని అకౌంట్ లో రాయితీ అమౌంట్ జమ అవుతుంది. ఈ నేపథ్యంలో రెండో విడత సిలిండర్ ఇంతవరకు బుక్ చేసుకోనటువంటి వారు జూలై 31 లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రెండవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ అమౌంట్ ను కోల్పోతారు.
ఆగస్టు ఒకటి నుంచి మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ గడువు ప్రారంభమవుతుంది. రెండవ విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకుండా ఆగస్టులో మీరు సిలిండర్ కానీ బుక్ చేస్తే మూడో విడత రాయితీ పొందేందుకు మాత్రమే మీరు అర్హులవుతారు. కాబట్టి ఇంకా రెండో విడత పెండింగ్ ఉన్నవారు నెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగా నమోదు చేసుకోవడం మరియు బ్యాంక్ అకౌంట్ ను యాక్టివ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగా లేకపోవడంతో సుమారు 86 వేల మందికి రెండవ విడత రాయితీ అమౌంట్ జమ కాలేదని ప్రభుత్వం గుర్తించింది.
| ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఫిర్యాదులు మరియు మరింత సమాచారం కోసం 1 9 6 7 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి అడగవచ్చు.
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు క్లిక్ చేయండి.
Leave a Reply