Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – August 6, 2025 – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – August 6, 2025 – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేక రంగాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మహిళల సాధికారత, నేతన్నలకు భరోసా, పెట్టుబడులు, పారిశుధ్యం, గవర్నెన్స్ టెక్నాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ భేటీ కీలక అంశాలు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు మీకోసం..

AP Cabinet meeting 06 August 2025

నేతన్నలకు 25000 .. కొత్త పథకం

అంతేకాకుండా నేతన్న భరోసా పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ద్వారా నేతన్నల కు  ప్రతి ఏడాది 25 వేలు అందించనుంది.

స్ట్రీ శక్తి పథకం

  • ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం.
  • “స్త్రీ శక్తి” పేరుతో ఉద్దేశిత పథకం అమలు.
  • మంత్రులు, అధికారులు మొదటి రోజు బస్సుల్లో పాల్గొననున్నారు.

సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు నేటి క్యాబినెట్లో ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త బార్ పాలసీ – సెప్టెంబర్ 1 నుండి

  • పునరుద్ధరిత బార్ పాలసీ అమల్లోకి వస్తుంది.
  • పర్యాటక ప్రాంతాల్లో కొత్త లైసెన్సుల ఆమోదం.
  • బార్లను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం.

సింగపూర్ టూర్ ఫలితాలు

  • జూలై 26–31: సింగపూర్ పర్యటనలో 41 పెట్టుబడిదారులతో సమావేశాలు.
  • విశాఖపట్నం పెట్టుబడి సదస్సు త్వరలో నిర్వహణకు సిద్ధం.

అమరావతి రాజధానిగా స్పష్టత

  • ఒక్కటే రాజధాని అమరావతి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • పలు సంస్థలకు భూ కేటాయింపులు.

నలా చట్టం రద్దు

  • వ్యవసాయ భూములను వాణిజ్య గమనికి మార్పు సులభతరం చేయాలని నిర్ణయం.
  • పన్ను చెల్లింపు ద్వారా స్వయంగా భూముల మార్పు.

అమరావతి క్వాంటం మిషన్

  • అమరావతిలో 50 ఎకరాల్లో “క్వాంటం వ్యాలీ” ఏర్పాటు.
  • AI, Quantum Computing సంస్థలకు ప్రోత్సాహం.

₹3,653 కోట్లు – బద్వేల్ నుండి నెల్లూరు వరకు హైవే

  • 4-లేన్ హైవే నిర్మాణానికి ఆమోదం.
  • వ్యయము: ₹3,653 కోట్లు.

₹80,000 కోట్లు పెట్టుబడులు – 1.5 లక్షల ఉద్యోగాలు

  • ఎలక్ట్రానిక్ భాగాల తయారీ పాలసీ 4.0 (2025–30) కింద పెట్టుబడులకు అనుమతులు.
  • 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారు.

పారిశుధ్యం – లెగసీ వేశ్ట్ ఫ్రీ రాష్ట్రం

  • 2025 చివరి వరకు లెగసీ వ్యర్థాల నిర్వహణ పూర్తి చేయాలని లక్ష్యం.
  • 6 నగరాల్లో Waste-to-Energy Plants ఏర్పాటుకు ఆమోదం.

స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీ

  • CCTV హాట్‌స్పాట్‌లు, బ్లాక్‌చైన్ ఆధారిత రికార్డులు అమలు.
  • డేటా లేక్స్, లైట్‌నింగ్ అలర్ట్‌లు – రియల్ టైమ్ గవర్నెన్స్ భాగంగా.

📌 ముఖ్యమైన నిర్ణయాల పట్టిక

విభాగంనిర్ణయం
మహిళల సాధికారతఉచిత బస్సులు (స్త్రీ శక్తి) – ఆగస్టు 15 నుంచి
బార్ పాలసీకొత్త బార్ పాలసీ – సెప్టెంబర్ 1 నుండి
రాజధాని స్పష్టతఅమరావతి ఒక్కటే రాజధాని
భూముల మార్పునలా చట్టం రద్దు, పన్నుతో స్వయంగా మార్పు
టెక్నాలజీక్వాంటం వ్యాలీ, AI సంస్థలు అమరావతిలో
హైవే నిర్మాణంబద్వేల్–నెల్లూరు ₹3,653 కోట్లు
పెట్టుబడులు & ఉపాధి₹80,000 కోట్లు, 1.5 లక్షల ఉద్యోగాలు
వేశ్ట్ మేనేజ్‌మెంట్6 నగరాల్లో ప్లాంట్లు, Legacy waste free AP
గవర్నెన్స్ టెక్నాలజీCCTV, Blockchain, Alerts

ఈ నిర్ణయాలు అభివృద్ధి, మహిళ సాధికారత, పారిశుధ్య నిర్వహణ, మరియు ఆధునిక గవర్నెన్స్ పై రాష్ట్ర ప్రభుత్వ దృష్టిని సూచిస్తున్నాయి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page