జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపి సీఎం గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి పది రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ పడలేదు.
చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, ఇంకా అమౌంట్ పడని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ఉన్న అందరికి అమౌంట్ ఈ వారం లోపు అనగా జూలై 16 లోగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కింది లింకు ద్వారా మీరు అమ్మ ఒడి 2023 పేమెంట్ స్టేటస్ ను చెక్ చేయండి
ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లను ప్రభుత్వం జమ చేస్తుంది.
ఇందుకు సంబంధించి 10 రోజులపాటు మండల స్థాయిలో కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అయితే పది రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా లబ్ధిదారుల ఖాతాలో చాలామందికి అమౌంట్ పడని నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఇచ్చిన క్లారిటి తో కొంత ఉపశమనం లభించింది. అయితే ఈసారి అయినా ప్రభుత్వం పేర్కొన్న విధంగా జూలై 16 లోగా అమౌంట్ జమ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇదే ఏడాది మిగిలిన సంక్షేమ పథకాల అమౌంట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యంగా జమ చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram చానెల్ లో జాయిన్ అవ్వండి
Leave a Reply