రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ ను ముఖ్యమంత్రి బుధవారం విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి చాలా తక్కువ సమయాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ విడుదల ప్రక్రియను కూడా పది రోజుల వరకు పొడిగించింది. అమ్మ ఒడి అమౌంట్ ఇంకా పడని వారు కింది వివరాలను చెక్ చేయవచ్చు అదేవిధంగా ఆన్లైన్ లో సులభంగా మీ పేమెంట్ స్టేటస్ ని కూడా చూడవచ్చు.
జగనన్న అమ్మఒడి 2023 24 అమౌంట్ పడలేదా?
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా మీ ఖాతాలో అమౌంట్ పడనట్లయితే కింది కారణాలు అయి ఉండవచ్చు.
ఆలస్యంగా ప్రారంభమైన ఈ కేవైసీ ప్రక్రియ
ఈసారి చాలా తక్కువ సమయం జగనన్న అమ్మఒడి ఈకేవైసీ కోసం ఇవ్వడం జరిగింది. వాలంటీర్ల ద్వారా ఈ కేవైసి అనగా థంబ్ తీసుకునే ప్రక్రియను కేవలం అమ్మ ఒడి ప్రారంభానికి రెండు రోజుల ముందే ప్రారంభించడం జరిగింది. దీనివలన ఇంకా కొంతమంది పేర్లు ఈ కేవైసీ ప్రక్రియకు రాలేదు. ఇందుకు పలు సాంకేతిక కారణాలు మరియు పాఠశాలల నుంచి డేటా రాలేదని ప్రభుత్వం పేర్కొంది. దీనితో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ విడుదల చేసే సమయానికి చాలామంది ఈ కేవైసీ పూర్తి కాలేదు.
దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎవరికైతే జగనన్న అమ్మఒడికి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ జూన్ 28 తర్వాత పూర్తవుతుందో వారికి జూలై మొదటి వారంలో అమౌంట్ జమ చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఈ కేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపింది. ఇంకా పేరు రాని వారు మీ వాలంటీర్ ను లేదా సచివాలయం లో సంప్రదించి గ్రీవెన్స్ పెట్టగలరు. ఒకవేళ స్కూల్ నుంచి డేటా రాలేదు అని చెప్పినచో వెయిట్ చేయండి.
ఈసారి పది రోజులపాటు జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం
ఇక జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈసారి జూలై 7 వరకు మండల స్థాయిలో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో జూలై 7 వరకు కూడా అమౌంట్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మీకు అర్హత ఉండి, జాబితాలో పేరు ఉన్నప్పటికీ అమౌంట్ పడకపోతే జూలై 7 వరకు వేచి చూడాలి.
కొంతమంది పేర్లు సచివాలయంలో ఎటువంటి జాబితాలో రాలేదు
సచివాలయాల వారీగా లబ్ధిదారుల జాబితా మరియు అనర్హుల జాబితా ను అందుబాటులో ఉంచింది. అయితే జాబితాలో అర్హుల మరియు అనర్హుల జాబితాలో తమ పేరు లేదని కొంతమంది లబ్ధిదారులు పేర్కొనడం జరిగింది.
ఇందుకు సంబంధించి సచివాలయం లాగిన్ లో గ్రివెన్స్ అంటే కంప్లైంట్ తీసుకునే ఆప్షన్ను కల్పించడం జరిగింది. అటువంటి లబ్ధిదారులు లేదా ఇంకేదైనా సాంకేతిక సమస్యలు ఉండి మీకు అమ్మఒడి జాబితాలో పేరు లేకపోతే వెంటనే సచివాలయంలో కంప్లైంట్ పెట్టండి
బ్యాంకులకు జూలై 29 న సెలవు దినం
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంకులకు బక్రీద్ పర్వదిన సందర్భంగా జులై 29న సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి పేమెంట్స్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నవారికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇక జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ మరియు మీరు ఎలిజిబుల్ అవునా కాదా ఇలా చెక్ చేయండి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.
ఒకవేళ మీకు అప్లికేషన్ స్టేటస్ లో జూన్ 2023 వద్ద ఎలిజిబుల్ అయి ఉండి, జాబితాలో పేరు ఉండి ఇంకా పేమెంట్ డీటెయిల్స్ లో చూపించకపోతే పైన పేర్కొన్న విధంగా కొంత సమయం వెయిట్ చేయండి లేదా మీ సచివాలయంలో సంప్రదించండి.
కింది లింకు ద్వారా మీరు అమ్మ ఒడికి పేమెంట్ స్టేటస్ ను చెక్ చేయండి
Leave a Reply