జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారులకు అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి వారం రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ కాలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు
ఇందుకు సంబంధించి studybizz ఎప్పటికప్పుడు వెబ్సైట్ మరియు సోషల్ మీడియా గ్రూప్స్ లో పోల్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇంకా చాలామందికి అమౌంట్ అందాల్సి ఉంది.
ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి అమౌంట్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే జూన్ 28 నుంచి జూలై 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. జూలై 7 లోపు అమౌంట్ కూడా జమ చేయనున్నట్లు తెలిపింది. అయితే జూలై 7 దాటినా ఇప్పటివరకు అమౌంట్ పడ లేదు అని లబ్ధిదారులు వాపోతున్నారు.
అమ్మ ఒడి ఆన్లైన్ పోల్ 2023-24
పది రోజుల గడువు దాదాపు పూర్తి అవుతున్న నేపథ్యంలో మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా తెలుసుకునేందుకు కింద ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాము. ఈ పోల్ మీ తోటి లబ్ధిదారుల అవగాహన కోసం ఉపయోగపడుతుంది.
కాబట్టి ఓటు వేసేవారు దయచేసి సరైన సమాచారాన్ని అందించగలరు. మీకు అమౌంట్ అయితే , అయింది అని పడకపోతే ఇంకా పడలేదు అని ఎంచుకోగలరు.
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ కింది విధంగా తెలుసుకోండి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్ లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.
కింది లింకు ద్వారా మీరు అమ్మ ఒడి 2023 పేమెంట్ స్టేటస్ ను చెక్ చేయండి
చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, చాలా మంది లబ్ధిదారుల ది ఇదే పరిస్థితి. కాబట్టి అర్హత ఉన్నవారు వెయిట్ చేయండి లేదా మీ సచివాలయం లో సంప్రదించండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి
Leave a Reply