ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆర్థిక సాయం కింద ఏడాదికి 15000 అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం తల్లులు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది.
ఈ ఏడాదికి గాను అమ్మ ఒడి పథకం నాలుగో విడత జూన్ 28 న విడుదల కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాను కచ్చితంగా NPCI మ్యాపింగ్ చేసుకొని ఉండాలి. NPCI మ్యాపింగ్ ఆక్టివ్ లేని వారికి ప్రభుత్వం అమౌంట్ విడుదల చేసినప్పుడు పేమెంట్ ఫెయిల్ అవుతుంది.
NPCI మ్యాపింగ్ Active/Inactive ఉన్నా ప్రభుత్వం ఎలిజిబుల్ గా పరిగణిస్తుంది.NPCI ఆక్టివ్ లేనివారు తమ బ్యాంక్ ను సంప్రదించి activate చేసుకోవాలి. లేనిచో పేమెంట్ ఫెయిల్ అవుతుంది.
Aadhar and bank NPCI Mapping Status.. మీ బ్యాంక్ ఖాతాకు NPCI మ్యాపింగ్ యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేయండి.
అసలు NPCI Mapping అంటే ఏమిటి?
వివిధ సంక్షేమ పథకాలన్నిటికి సంబంధించిన అమౌంట్ ను ఒకే బ్యాంక్ అకౌంట్ కి పంపించేందుకు వీలుగా NPCI mapping చేస్తారు. ఇందులో భాగంగా ముందుగా ఆధార్ కార్డుని బ్యాంక్ ఖాతాకు లింక్ చేస్తారు. తర్వాత అన్ని పథకాల అమౌంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT కోసం మీరు ఎంచుకున్న బ్యాంక్ అకౌంట్ కి NPCI Mapping (aadhaar సీడింగ్ తో పాటు) చేస్తారు.
ఒకవేళ ఎన్పీసీఐ స్టేటస్ లో ఇనాక్టివ్ అని చూపిస్తే మీరు సంక్షేమ పథకాలకు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతా ఉన్నటువంటి బ్యాంక్ ని సంప్రదించి NPCI లింక్ చేయమని అడగాలి. ఆధార్ కాపీని తప్పనిసరిగా తీసుకుపోవాలి. వారు ఒక ఫామ్ ద్వారా మీ వివరాలను నింపి NPCI మ్యాపింగ్ పూర్తిచేస్తారు. వారం రోజులలోపు ఈ డేటా అప్డేట్ అవుతుంది.
అమ్మ ఒడి షెడ్యూల్ విడుదల.. థంబ్ ఎప్పటి లోపు అంటే
జగనన్న అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించి ప్రభుత్వం టైం లైన్స్ తో కూడిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది.
- సోషల్ ఆడిట్ కోసం లబ్ధిదారుల తాత్కాలిక జాబితా జూన్ 12 నాటికి విడుదల చేయనున్నారు.
- ఈ కేవైసీ అనగా థంబ్ ను సచివాలయం ద్వారా జూన్ 12 నుంచి 22 మధ్యలో తీసుకోవడం జరుగుతుంది.
- ఇక జూన్ 22 నుంచి 24 మధ్యలో లబ్ధిదారుల తుది జాబితా విడుదల చేస్తారు
- జూన్ 28న అమ్మ ఒడి 2023ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు
అమ్మ ఒడి 2023 పూర్తి షెడ్యూల్ కింది లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
Leave a Reply