జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు గుడ్ న్యూస్..గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మ ఒడి నిధులను జూన్ లో విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ నూతన డైరెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లక్ష్మిశ కీలక ప్రకటన చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన గ్రామ వార్డు సచివాలయాల అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా అమ్మ ఒడి అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలని, మే 25 నాటికి ఫీల్డ్ లెవల్లో పరిశీలన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ మేరకు 2023 సంవత్సరానికి సంబంధించి జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను జూన్ 13 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ఏడాది 27వ తేదీన 43,96,402 మంది లబ్ధిదారులకు ₹6,595 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం ప్రతి ఏడాది 13000 రూపాయలను జమ చేస్తున్న విషయం తెలిసిందే. 15వేల రూపాయలలో 2000 రూపాయలను టాయిలెట్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది.
ఏడాది కూడా జూన్ చివరి వారంలో ఈ అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమ్మ ఒడి పథకానికి సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ పొందటానికి కింది లింక్ ని క్లిక్ చేయండి
Leave a Reply