జగనన్న అమ్మ ఒడి పథకాన్ని గత నెల 28న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే 15 రోజులు దాటినా ఇప్పటివరకు అమ్మ ఒడి చాలామందికి చేరలేదు.
ఇంకా ఎంతమందికి అమౌంట్ పడాల్సి ఉంది? దీనిపై ప్రభుత్వం ఏం చెప్తుంది? స్టేటస్ ఎలా చూడాలి? పూర్తి వివరాలు మీకోసం
అమ్మ ఒడి అమౌంట్ అసలు ఎప్పుడు పడుతుంది?
గత నెల 28న ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ ను చాలామందికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు. ఇందుకు మరి నిర్దిష్టమైన కారణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేదు.
ఇందులో కొరతతో ఇంకా జమ చేయలేదా లేదా సాంకేతిక సమస్యల అనేది క్లారిటీ లేదు.
అయితే అమౌంట్ ను మాత్రం జూలై రెండవ వారం అంటే జూలై 10 నుంచి 16 మధ్యలో ప్రతిరోజు కొంతమందికి చొప్పున జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ఒకేసారి జమ చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అందుకే ప్రతిరోజు కొంతమందికి చొప్పున 16 లోపు పేమెంట్స్ అన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తుంది.
ఈ వారం జమ చేస్తామని తెలిపినా, ఈ వారం ఇప్పటికే పూర్తవుతున్నా ఇంకా 80 శాతం మందికి పేమెంట్ అందలేదు. ఏదో కొద్ది మందికి మాత్రమే ఈ వారం అమౌంట్ పడింది. ఇక శనివారం పాక్షికంగా బ్యాంకులు మూసి ఉంటాయి. మరి మిగిలిన సుమారు 80 శాతం మంది లబ్ధిదారులందరికీ ఈ వారంలో అమౌంట్ వేస్తారా అనేది ప్రశ్న. అయితే ప్రభుత్వం తెలిపిన విధంగా 16వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
అమ్మ ఒడి ఎంతమందికి పడింది ఇంకా ఎంతమందికి పడాలి?
అసలు అమ్మఒడి అమౌంట్ ఎంతమందికి పడింది ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉంది అనే దాని పైన ఇప్పటికే పలుసార్లు Studybizz ద్వారా పోల్స్ నిర్వహించడం జరిగింది.
లేటెస్ట్ పోల్ ప్రకారం 80% పైగా లబ్ధిదారులకు అమౌంట్ ఇంకా జమ కావాల్సి ఉంది.
మీకు అమ్మ ఒడి అమౌంట్ జమ అయిందా? అయితే అయిందని అవ్వకపోతే ఇంకా పడలేదు అని సెలెక్ట్ చేయండి.
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్ లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.
చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, అమౌంట్ జూలై రెండో వారం అనగా జూలై 16 లోపు విడుదల చేయనున్న ప్రభుత్వం. కాబట్టి వెయిట్ చేయండి అప్పటికి అవ్వకపోతే మీ సచివాలయం లో సంప్రదించండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
Leave a Reply