జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి అందరికీ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చెల్లింపులు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నిధులు విడుదల చేసిన 3 వ వారం నుంచి ప్రతి రోజూ కొంత మంది లబ్ధిదారుల చప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వచ్చింది. ప్రస్తుతం అందరి ఖాతాలో పెండింగ్ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
పోర్టల్ లో స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ కూడా ప్రభుత్వ పోర్టల్ లో అప్డేట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమౌంట్ పడిన అందరికీ ఈ వారంతానికి పూర్తి స్థాయిలో స్టేటస్ అనేది అప్డేట్ చేస్తామని వెల్లడించింది.
ఇంకా ఎవరికైనా అమౌంట్ పడలేదా? ఇలా చేయండి
ఇప్పటికీ ఎవరికైనా అమౌంట్ పడకపోతే సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవాలని ప్రభుత్వం తెలిపింది. NPCI లింక్ ఆలస్యం అవడం లేదా ఇంకా ఇతర కారణాల చేత పెండింగ్ ఉన్న వారికి వచ్చే వారం అమౌంట్ పడుతుంది. వారికి సచివాలయం లో “పేమెంట్ క్రెడిట్ అవ్వలేదు” అనే ఆప్షన్ లో కంప్లైంట్ తీసుకుంటున్నారు.
పూర్తిగా పేమెంట్ ఫెయిల్ అయిన వారికి కూడా ఎందుకు ఫెయిల్ అయిందో వచ్చే వారంలోగా పోర్టల్ స్టేటస్ లో అప్డేట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటివరకు అమౌంట్ పడని వారు వెంటనే మీ సచివాలయంలో సంప్రదించండి.
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
కింది లింకు లో మీరు ఆన్లైన్లో అమ్మ ఒడి ఏ విధంగా చెక్ చేయవచ్చు అదేవిధంగా చెక్ చేసే లింక్ ఇవ్వబడ్డాయి. మీకు అప్లికేషన్ స్టేటస్ లో Eligible అని పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ అని చూపిస్తుంది.
గమనిక : ప్రస్తుతం అమౌంట్ పడిన వారికి కింది విధంగా రెండు సక్సెస్ రికార్డులు చూపిస్తుంది.
మీకు ఇంకా పేమెంట్ జమ కాకపోతే వెంటనే మీ సచివాలయంలో సంప్రదించండి. బ్యాంక్ ఆధార్ NPCI Mapping status కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply