Adarana 3 scheme: గీత కార్మికులకు త్వరలో టూ వీలర్

Adarana 3 scheme: గీత కార్మికులకు త్వరలో టూ వీలర్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. త్వరలో వీరి కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఆదరణ 3.0 (Adarana 3 scheme) పేరుతో గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇచ్చే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ బీసీ, చేనేత, జోలి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు.

గీత కార్మికులకు టూ వీలర్ మరియు ఈ బెనిఫిట్స్ [Benefits of Adarana 3 scheme for Toddy Tappers]

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌతు లచ్చన్న 116వ జయంతి ని పురస్కరించుకొని మంత్రి సబిత ఈ ప్రకటన చేశారు.

గీత కార్మికులకు ఆదరణ 3.0 పథకం కింద లభించే లబ్ధి

  • గీత కార్మికులకు తాటి చెట్లు ఎక్కడానికి అత్యాధునిక పరికరాలు అందించడం జరుగుతుంది.
  • ఈ ఆధునిక పరికరాలు 90% సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తుంది. కేవలం పది శాతం మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.
  • గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించడం జరుగుతుంది.
  • గీత కార్మికులకు మూడు స్లాబులలో లోన్ అందించే సౌకర్యం కూడా ఉండనుంది.

ఆదరణ 3.0 పథకానికి అర్హతలు – Eligibility of Aadarana 3.0 scheme

ఆదరణ 3 పథకానికి అర్హత సాధించాలంటే

  • సదురు లబ్ధిదారులు ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • బీసీకి చెందిన గీత కార్మికుడై ఉండాలి.
  • వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి.

ఆదరణ 3.0 పథకం పూర్తి వివరాలు – దరఖాస్తు విధానం, అర్హత, లబ్ధిదారుల జాబితా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల (BC), అణగారిన వర్గాల (SC, ST), మైనారిటీలు మరియు బీ.పి.ఎల్. కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆదరణ 3.0 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 70% వరకు సబ్సిడీ లభిస్తుంది.

అర్హతలు (Eligibility)

  • వయస్సు: 18–50 సంవత్సరాలు
  • రేషన్ కార్డు: BPL తప్పనిసరి
  • వర్గాలు: BC / SC / ST / మైనారిటీలు
  • కుటుంబ వార్షిక ఆదాయం: గ్రామీణం ≤ ₹1.5 లక్షలు, పట్టణం ≤ ₹2 లక్షలు

అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • కుల ధృవపత్రం
  • ఆదాయ ధృవపత్రం
  • బ్యాంక్ పాస్‌బుక్ కాపీ
  • తాజా ఫోటో

దరఖాస్తు విధానం

  1. apobmms.cgg.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
  2. “Apply Online” లో “ఆదరణ 3.0” ఎంచుకోండి
  3. ఆధార్ & మొబైల్‌తో OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి
  4. వివరాలు నింపి, వృత్తి/యూనిట్ ఎంచుకోండి
  5. పత్రాలు అప్‌లోడ్ చేసి Submit చేయండి
  6. అప్లికేషన్ Ack. Slip డౌన్‌లోడ్ చేసుకోండి

వృత్తుల జాబితా (Sample)

విభాగంవృత్తులు / యూనిట్లు
ఆటోమొబైల్ & మెకానికల్ఆటో రిపేర్ షాప్, బైక్ సర్వీసింగ్, మెకానికల్ వర్క్‌షాప్
కుట్టు & హస్తకళలుటైలరింగ్ యూనిట్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ వర్క్
ఫుడ్ & డెయిరీటిఫిన్ సెంటర్, కూల్ డ్రింక్స్ వ్యాపారం, ఐస్ క్రీమ్ యూనిట్
ఎలక్ట్రికల్ & లైటింగ్ఎలక్ట్రానిక్ రిపేరింగ్, లైటింగ్ & సౌండ్ సిస్టమ్
వ్యవసాయం సంబంధితడెయిరీ యూనిట్, పౌల్ట్రీ యూనిట్, ఫిషరీస్ పరికరాలు
ఇతరాలుబ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ స్టూడియో, చిన్న కిరాణా షాప్

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

  • ఆదరణ 3.0 లో ఎంత సబ్సిడీ వస్తుంది? – 70% వరకు
  • ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? – BC, SC, ST, మైనారిటీ BPL కార్డుదారులు
  • ఎలా అప్లై చేయాలి? – apobmms.cgg.gov.in ద్వారా
  • ఏ పత్రాలు అవసరం? – ఆధార్, రేషన్ కార్డు, కుల/ఆదాయ ధృవపత్రం, బ్యాంక్ పాస్‌బుక్
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page