ఏపీలో ఇకపై సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఉండాలనే నిబంధనను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
పథకాల అమలులో పారదర్శకత కోసమే
సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రభుత్వ పరిధిలో సంక్షేమ పథకాలు మరియు రాయితీల కు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఆధార్ లేని వారిని గుర్తించి దరఖాస్తు తీసుకోవాలి
ప్రస్తుతం ఆధార్ లేని వారికి తాత్కాలికంగా వేరే డాక్యుమెంట్స్ ఆధారంగా పథకాలు అందించాలని, ఆధార్ లేని వారిని గుర్తించి వారి నుంచి తప్పనిసరిగా ఆధార్ కోసం దరఖాస్తు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
అలాగని ఆధార్ లేని వారికి సంక్షేమ పథకాలు ఆపరాదని పేర్కొంది.
ఇక ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మూడు నెలల్లో ఆధార్ కేటాయించి వాటిని సంక్షేమ పథకాలు అనుసంధానం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆధార్ సంబంధించిన అన్ని ముఖ్యమైన లింక్స్ కోసం కింది పేజ్ ను చెక్ చేయండి
ఆధార్ సంబంధించిన అన్ని ముఖ్యమైన లింక్స్ మరియు డాక్యుమెంట్స్ కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి
Leave a Reply