ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి బాలబాలికలకు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయనటువంటి చిన్నారులు ఏడు కోట్ల మంది ఉన్నట్లు UIDAI వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నేరుగా పాఠశాలల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్(aadhar biometric update for children in schools) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు udai కీలక ప్రకటన చేసింది.
ఐదేళ్లు దాటిన పిల్లలకు పాఠశాలల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్క చిన్నారికి తాము చదువుకునే పాఠశాలలోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసే సౌకర్యాన్ని తీసుకు వస్తున్నట్లు ఆధార్ కస్టోడియను ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ కీలక ప్రాజెక్టు కోసం ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ డివైస్ లను పంపించి ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమలు చేయటానికి మరో 60 రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.
తల్లిదండ్రుల సమ్మతితో చిన్నారులకు ఈ ఆధార్ అప్డేట్ ప్రక్రియ అనేది చేపడతారు. ఏడేళ్లు వరకు ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోకపోతే ఆధార్ డిలీట్ అయిపోతుంది అని ఇప్పటికే UIDAI ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడు సంవత్సరాలు దాటిన వారికి అయితే వంద రూపాయలు రుసుము తోటి ఈ ప్రక్రియ చేపడుతారు. 15 ఏళ్లు నిండిన వారికి కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వారికి కూడా పాఠశాలలు మరియు కళాశాలలో ఇదే ప్రక్రియలు చేపట్టే దిశగా ఉడాయ్ కార్యచరణ రూపొందిస్తుంది.
స్కూల్ అడ్మిషన్, స్కాలర్షిప్ ఇంకా ఇతర ఏవైనా DBT పథకాలు పొందాలన్నా కూడా తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని UIDAI తెలిపింది.
|ఆధార్ కి సంబంధించి ముఖ్యమైన లింక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లోకి ఎందుకు క్లిక్ చేయండి.
Leave a Reply