ఆధార్ అడ్రస్ అప్డేట్ సులభంగా 5 నిమిషాలలో కింది విధంగా ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు.
ఇందుకోసం కింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి uidai వెబ్సైట్లో అడ్రస్ మార్చుకోవచ్చు.
1. ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఆధార్ లింక్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. మీ ఆధార్ నంబర్ మరియు CAPTCHA ఎంటర్ చేసి రిక్వెస్ట్ otp పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి వచ్చిన otp ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యండి
2. లాగిన్ అయిన తరువాత కింది విధంగా హోం పేజీ ఓపెన్ అవుతుంది
3 తరువాత name/Gender/date of birth & address update ఆప్షన్ పైన క్లిక్ చేయండి
4. క్లిక్ చేసిన తరువాత address అప్డేట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. Update address online ఆప్షన్ పైన క్లిక్ చేయండి
5. క్లిక్ చేసిన తరువాత కింది విధంగా instructions open అవుతాయి. మొత్తం చదివాక proceed to update Aadhar బటన్ పైన క్లిక్ చేయండి
6. ఆ తరువాత స్క్రీన్ లో అడ్రస్ ఆప్షన్ నీ సెలక్ట్ చేసుకోండి
7. Address ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత Proceed to update Aadhar పైన క్లిక్ చేయండి
8. క్లిక్ చేసిన తరువాత మీ ప్రస్తుత అడ్రస్ చూపిస్తుంది.
9. తరువాత మీ అప్డేట్ చేయాలనుకున్న అడ్రస్ ని కింద అప్డేట్ చెయ్యండి
10. మీ అడ్రస్ లో కొత్త జిల్లాని మార్చుకోవాలని ఉంటే ముందుగా pincode ఎంటర్ చేయండి. తర్వాత మీ జిల్లా ఎంచుకునేటప్పుడు మీకు కొత్త జిల్లాలు కనిపిస్తాయి. కొత్త జిల్లా ఎంచుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ లో ప్రూఫ్స్ ఇవ్వబడ్డాయి.
11. తరవాత ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి.
కొత్త జిల్లాలకు సంబంధించి మీరు వాటర్ బిల్, గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్,కరెంట్ బిల్, పాస్ పోర్ట్, ప్రాపర్టీ టాక్స్ receipt లో ఏదో ఒక దానిని ఇవ్వవచ్చు. అయితే వీటిలో మీకు కొత్త జిల్లా తో ఉన్న సరైన అడ్రస్ ఉండాలి. ఒకవేళ వాటిలో కొత్త జిల్లా లేకుంటే, ముందుగా వాటిలో మార్చుకొని తర్వాత upload చేయవచ్చు.
Note: గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏప్రిల్ 3 నుంచి అడ్రస్ ప్రూఫ్ జారీ చేస్తున్నారు. అవి వచ్చాక వాటిని upload చేసి కూడా మీరు మార్చుకోవచ్చు
మీకు పైన తెలిపిన ఎటువంటి డాక్యుమెంట్ proofs లేని పక్షంలో మాత్రమే కింద ఇవ్వబడిన అప్డేట్ ఫారం లో గజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకొని upload చేసే అవకాశం ఇచ్చారు , ఏ విధంగా ఫిల్ చేయాలో కింద ఇవ్వబడిన డాక్యుమెంట్లో సెకండ్ పేజ్ లో చూడండి. అదే విధంగా ఆధార్ కేంద్రాల్లో దీనితో పాటు enrollment ఫారం లో పంచాయతీ సెక్రెటరీ ద్వారా signature కూడా తీసుకుంటున్నారు. రెండు ఫారం లు కింద ఇవ్వబడ్డాయి.
Note: మీ దగ్గర సరైన ప్రూఫ్స్ ఉంటేనే ఆన్లైన్లో చేయండి లేదంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో చేస్తున్నట్లైతే ఆఫ్లైన్ పద్ధతి ఎంచుకోవడం మంచిది.
పూర్తి డాక్యుమెంట్స్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి
12. సెలెక్ట్ చేసుకున్నాక upload పైన క్లిక్ చెయ్యండి.
13. డాక్యుమెంట్ అప్లోడ్ చేశాక మీ కొత్త అడ్రస్ వివరాలను నెక్స్ట్ స్క్రీన్ లో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొండి
14. తరవాత payment screen open అవుతుంది. ఆధార్ అడ్రస్ కి నిర్ధారించిన అమౌంట్ ₹50 రూపాయలు పే చేసి సబ్మిట్ చేస్తే మీ అడ్రస్ అప్డేట్ అవుతుంది.
15. మీ పేమెంట్ పూర్తి అయిన తర్వాత మీకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అందులో మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి SRN నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. వారంలోపు మీ అడ్రస్ అప్డేట్ అయిపోతుంది.
మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ SRN ఉపయోగించి ఎప్పుడైనా చెక్ చేసుకోవాలంటే కింది లింక్ పై క్లిక్ చేయండి.
Note: మీ దగ్గర సరైన డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ లో అడ్రస్ అప్డేట్ కి అప్లై చేసుకోవటం మంచిది. ఏపి లో అయితే గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అవి కూడా సరిపోతాయి.ఒకవేళ మీ దగ్గర వీటిలో ఎటువంటి ప్రూఫ్ లేకపోతే gazatted ఆఫీసర్ ద్వారా సంబంధిత ఫారం లో సిగ్నేచర్ తీసుకొని మార్చుకోవాలని అనుకున్నట్లయితే మీరు offline పద్ధతి ఎంచుకోవడం మంచిది.అంతిమ నిర్ణయం మీదే. ఈ సమాచారం మీకు కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే.
Leave a Reply