ఆధార్ కార్డ్ కలిగిన వారందరికీ గుడ్ న్యూస్.. ఆధార్ కి సంబంధించి ఇప్పటికే అడ్రస్ ను మనం ఆన్లైన్ లో మార్చుకునే సౌలభ్యం ఉంది.
అడ్రస్ తో పాటు, పేరు లో చిన్న చిన్న సవరణలు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటివి కూడా ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్ లో ఫీజ్ చెల్లించి మార్చుకోవచ్చు.
వీటితో పాటు ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ లేదా ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించి ఈ కేవైసి చేయాలంటే కూడా ఆధార్ కి లింక్ అయిన మొబైల్ otp ఎంటర్ చేసి kyc పూర్తి చేయవచ్చు. అయితే ఆధార్ సహా ఏవైనా లావాదేవీలు, లేదా సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ (థంబ్) వేయాలంటే మనం ఆఫ్లైన్ లో అంటే స్వతహా గా అక్కడకు వెళ్లి వేయాలి. త్వరలో ఇటువంటి వారికి భారీ ఊరట లభించనుంది.
త్వరలో ఇంటివద్దనే టచ్ లెస్ బయోమెట్రిక్ (థంబ్)
ఆధార్ ప్రాధికార సంస్థ త్వరలోనే touchless Biometrics విధానాన్ని ప్రవేశబెట్టబోతుంది. ఈ విధానం అమలు లోకి వస్తె ఎక్కడినుంచి అయినా వినియోగదారులు బయోమెట్రిక్ అనగా థంబ్ వేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం అయిన మొబైల్ ఫింగర్ప్రింట్స్ క్యాప్చర్ వ్యవస్థను రూపొందిస్తుంది. UIDAI ఇందుకోసం ఐఐటీ బాంబే తో ఒప్పందం చేసుకుంది.
మరింత సౌకర్యవంతంగా మరియు ఎక్కువ సక్సెస్ రేట్ తో ఈ ఆప్షన్ పనిచేయనున్నట్లు సమాచారం.
Leave a Reply