September Month Pension Guidelines -సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీపై విధివిధానాలు జారీ

September Month Pension Guidelines -సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీపై విధివిధానాలు జారీ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం : సెప్టెంబర్ నెల పింఛన్లు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పింఛన్లు పంపిణీ బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు సెప్టెంబరు 1వ తేది ఆదివారం గనుక సెప్టెంబరు నెల పెన్షన్ పంపిణీ ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 2 వ తేదీలలో జరుగుతుందని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది .పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.

సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణి సూచనలు

  • సెప్టెంబరు 1వ తేది ఆదివారం గనుక సెప్టెంబరు నెల పెన్షన్ పంపిణీ ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 2 వ తేదీలలో జరుగుతుంది. ఆగస్టు 31, 2024న పింఛను పంపిణీ కోసం నియమించబడిన సిబ్బంది, అందరూ ఉదయం 6.00 గంటలకు పంపిణీ ప్రారంభించాలి.
  • పింఛను లబ్ధిదారులందరికీ ముందుగా తేదీల మార్పు గురించి ప్రతి గ్రామం మరియు వార్డులో విస్తృత ప్రచారం చెయ్యాలి.
  • విత్‌డ్రా కోసం 30వ తేదీన నగదు అందుబాటులో ఉంచడం కోసం బ్యాంకర్లతో రేపు (29 August) సమావేశం
  • మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలి. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వబడదు.
  • మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ & సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లోఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఈ సమాచారం ప్రతిపింఛనుదారునికి చేరాలి
  • 90 కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బంది కి మ్యాప్చేయబడిన చోట, అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి. ఈ మ్యాపింగ్ ప్రక్రియ 27.07.2024 నాటికి పూర్తి కావాలి.
  • సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్నిMPDO లు & కమీషనర్లకు పంపబడ్డాయి. ఈ మొత్తాలు30.082024న సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి. అన్ని PS/WASలకు వారి బ్యాంక్ మేనేజర్లకు లేఖను ముందుగానే అందించమని తెలియజేయండి. 30.08.2024న మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలి.
  • 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్నిరెండు రోజుల్లోపు SERPకి తిరిగి చెల్లించాలి.
  • చెల్లించని పింఛన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమసహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి.

పెన్షన్ వివరాలు

S.NoCategory
Pension Amount
(Rs.)
1వృద్ధాప్య పెన్షన్4000
2వితంతువు4000
3చేనేత కార్మికులు4000
4కళ్లు గీత కార్మికులు4000
5మత్స్యకారులు4000
6ఒంటరి మహిళలు4000
7సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు4000
8ట్రాన్స్ జెండర్4000
9ART(PLHIV)4000
10డప్పు కళాకారులు4000
11కళాకారులకు పింఛన్లు4000
12వికలాంగులు6000
13బహుళ వైకల్యం కుష్టు వ్యాధి6000
III. పూర్తి అంగవైకల్య వికలాంగుల పెన్షన్ Rs.15000/-
14పక్షవాతం వచ్చిన వ్యక్తి, వీల్ చైర్ లేదా మంచానికి పరిమితం అయిన వారు15000
15తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు మరియు ప్రమాద బాధితులు15000
16ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-Grade 410000
17కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి10000
18CKDU Not on Dialysis CKD Serum creatinine of >5mg10000
19CKDU Not on Dialysis CKD Estimated GFR <15 ml10000
20CKDU Not on Dialysis CKD Small contracted kidney10000
V. OTHER CATEGORIES
21CKDU on Dialysis Private10000
22CKDU on dialysis GOVT10000
23సికిల్ సెల్ వ్యాధి10000
24తలసేమియా10000
25తీవ్రమైన హీమోఫిలియా (<2% of factor 8 or 9)10000
26సైనిక్ సంక్షేమ పెన్షన్5000
27అభయహస్తం500
28అమరావతి భూమి లేని నిరుపేదలు5000

అర్హత ప్రమాణాలు

పెన్షన్అర్హతలు
వృద్ధాప్య పెన్షన్60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు.
గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు
వితంతు పెన్షన్ వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు.
భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వికలాంగుల పెన్షన్ 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు
చేనేత కార్మికుల పెన్షన్వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు.
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు
కల్లు గీత కార్మికుల పింఛన్వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
మత్స్యకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్వయో పరిమితి లేదు.
ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు.
డయాలసిస్ (CKDU) పెన్షన్వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5)
వయో పరిమితి లేదు.
ట్రాన్స్ జెండర్ పెన్షన్ 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు.
ఒంటరి మహిళ పెన్షన్ వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.
అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)
డప్పు కళాకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి.
చర్మకారుల పెన్షన్ వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది.
అభయ హస్తం పెన్షన్ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.

పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

You cannot copy content of this page