Prajapalana Phase 2: సెప్టెంబర్ 17 నుంచి రెండో దశ ప్రజాపాలన

Prajapalana Phase 2: సెప్టెంబర్ 17 నుంచి రెండో దశ ప్రజాపాలన

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. గత ఏడాది అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పథకాల దరఖాస్తు కొరకు మరియు రేషన్ కార్డుల దరఖాస్తు కొరకు తొలి దశ ప్రజాపాలన కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం రెండో దశ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ప్రకటించింది.

సెప్టెంబర్ 17 నుంచి రెండో దశ ప్రజా పాలన దరఖాస్తులు [Praja Palana Second Phase Applications]

సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ దశ ప్రజాపాలన దరఖాస్తులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ పై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.

ఈసారి నిర్వహించే రెండవ దశ ప్రజాపాలన దరఖాస్తులు ప్రత్యేకంగా హెల్త్ కార్డుల జారీ మరియు రేషన్ కార్డుల జారీ కొరకు నిర్వహించనున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26 వ తేదీ వరకు రెండో దశ ప్రజా పాలన దరఖాస్తులు సేకరించడం జరుగుతుంది. రేషన్ కార్డుల జారీ కి సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కొత్త రేషన్ కార్డుల జారీ మరియు హెల్త్ కార్డుల జారీ కొరకు కిందిస్థాయి అధికారులను సమాయత్తం చేయాలని ఆదేశించడం జరిగింది.

రేషన్ కార్డు కొరకు అర్హతలు మరియు డాక్యుమెంట్స్ [Eligibility For Ration cards in Telangana]

తెలంగాణ లో కొత్త రేషన్ కార్డు పొందాలంటే కింది అర్హతలు కలిగి ఉండాలి.

  • దరఖాస్తు చేసుకునే వ్యక్తి తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • స్థానిక నివాస దృవీకరణ కొరకు ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా ఇతర గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
  • వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 లక్షలు , పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు మించారాదు.
  • సదరు కుటుంబానికి తడి భూమి 3.5 ఎకరాలు, పొడి భూమి 7.5 ఎకరాలు మించరాదు. తడి పొడి కలిపి కూడా 7.5 ఎకరాలు మించకూడదు.

You cannot copy content of this page