గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత అప్పగించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల ఫోటోలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్లను శాశ్వతంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు.. ఇకపై టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు సచివాలయాల్లో ఉద్యోగులకు అవకాశం కల్పించింది. అంతేకాదు బుధ, గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులు కూడా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి సమగ్రశిక్ష ఎస్పీడీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్చార్జ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.
Also Read : ఆగస్టు 23న ఏపీలో MGNREGA గ్రామ సభలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో మరుగుదొడ్ల ఫొటోలను అప్లోడ్ చేసే బాధ్యతను ఆయా స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులకు (హెచ్.ఎం) అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తాము చదువు చెప్పేందుకు వచ్చామని.. మరుగుదొడ్ల ఫొటోలు తీసేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అప్పటి ప్రభుత్వ వారి గోడును పట్టించుకోలేదు. అప్పటి నుంచి వాళ్లే ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు.
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం టీచర్లకు టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవల తాత్కాలికంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా టీచర్లను ఈ బాధ్యతల నుంచి తప్పించింది.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులకు ఈ బాధ్యతను అప్పగించింది.
Also Read : సూపర్ 6 పథకాల అమలకు కట్టుబడి ఉన్నాం: నారా లోకేష్
ప్రతి సోమ, గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలను తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఇందుకోసం IMMS యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం ఇచ్చింది. కాగా, ఇది వరకు ఈ బాధ్యత ఉపాధ్యా యులపై ఉండేది.