AP Sand Booking: ఆన్లైన్ మరియు సచివాలయాలలో ఇసుక బుకింగ్

AP Sand Booking: ఆన్లైన్ మరియు సచివాలయాలలో ఇసుక బుకింగ్

గ్రామ వార్డు సచివాలయాలలో మరియు నేరుగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇసుకను మరింత పారదర్శకంగా అందించేందుకు నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చామని దీనిపై విపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

కేవలం నది నుంచి ఇసుక తోడినందుకు సీనరేజ్ మరియు రవాణా చార్జీలు పెట్టుకుంటే సరిపోతుందని తెలిపారు. సొంతంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకొని ఎడ్ల బండిలో గాని ట్రాక్టర్లో గాని లారీలో కానీ తరలించుకునే సదుపాయం ఉంటుందని. ఇసుక మాత్రం ఉచితంగానే అందిస్తున్నట్లు ఆయన అన్నారు.

గత 60 రోజుల పాలనలో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉచిత ఇసుక విధానాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కూడా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుని సదుపాయం ఉండేది. అయితే గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం తీసుకొని పూర్తిగా ఉచితంగా ఇస్తున్నట్లు, కేవలం సీనరేజ్ మరియు రవాణా చార్జీలు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇసుక ధర కొంతమేర తగ్గింది అనేది వాస్తవం.

You cannot copy content of this page