ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ పై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాలు మీకోసం.
వైద్య ఆరోగ్య శాఖ పై సీఎం కీలక నిర్ణయాలు ఇవే
సమీక్ష సమావేశం యొక్క ముఖ్యాంశాలు.
- ప్రభుత్వ ఆసుపత్రులను అత్యుత్తమ హాస్పిటల్స్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు.
- వైద్య ఆరోగ్య శాఖలో బెస్ట్ పాలసీలను అవలంబించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించాలి.
- గిరిజన ప్రాంతాల్లో డోలీ మోత లకు ఇక స్వస్తి. ఫీడర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని ఆదేశాలు.
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
- అన్ని జిల్లాల్లోనీ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో CT స్కాన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి.
- ఆసుపత్రుల్లో శిశువుల మిస్సింగ్ ఇకపై ఉండకూడదని ఆదేశించారు.
- తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో పంపిణీ చేసే ఈ కిట్ల ను తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
- పాఠశాల పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్న టీబీ కేసులపై కూడా సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అధికారులు, ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఆసుపత్రుల్లో ఉత్తమ విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.