ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు పాత ఓటర్ల సవరణలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఆగస్టు 20 నుంచి కొత్త ఓటర్ల నమోదు
ఏపి లో ఎన్నికల ముందు చివరగా ఓటర్ల నమోదు అవకాశం ఇచ్చిన ఈసి , తాజాగా మరో సారి కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు అవకాశం కల్పించింది.
పూర్తి షెడ్యూల్ ఇదే.
- ఆగస్టు 20 నుంచి BLO లు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు.
- వచ్చే ఏడాది అనగా జనవరి 1 2025 నాటికి 18 ఏళ్లు నిండేవారు అందరూ ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
- అక్టోబర్ 18 నాటికి ఈ ప్రక్రియ ను పూర్తి చేసి, అదే నెల అనగా అక్టోబర్ 29 న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.
- ఈ జాబితా పై నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
- జనవరి 6 2025 న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరుగుతుంది.