PM కిసాన్ 18 వ విడత అమౌంట్ ఎప్పుడు జమ అవుతాయని ఎదురు చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ . పీఎం కిసాన్ సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది.
దేశవ్యాప్తంగా 8 కోట్ల కు పైగా రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 18 న 17 వ విడత అమౌంట్ కింద 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయగా తాజాగా 18 వ విడత ఎప్పుడు జమ చేస్తారు అనే దానిపైన అధికారిక వర్గాల నుంచి సమాచారం వెళ్ళడైనట్లు తెలుస్తుంది.
పీఎం కిసాన్ 18 వ విడత అమౌంట్ అప్పుడే..
PM కిసాన్ కింద 2000 వెల రూపాయలను అక్టోబర్ 3 వ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అక్టోబర్ నాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ కింద అమౌంట్ కూడా జమ కానుంది. దీంతో రైతుల ఖాతాలో సుమారు 8 వేల రూపాయలు అమౌంట్ పడే అవకాశం ఉంది. అయితే అన్నదాత సుఖీభవ ఎన్ని విడతల్లో ఇస్తారు, ఏ విడత ఎంత అమౌంట్ ఇస్తారు అనే అంశాలపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.
ఇక అటు తెలంగాణ లో కూడా ఇదే సమయానికి రైతు భరోసా అమౌంట్ జమ అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి అక్టోబర్ నెల నాటికి రైతులకు అటు కేంద్రం నుంచి ఇటు రాష్టం నుంచి అమౌంట్ జమ కానుంది.