రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ రంగంలో మూల ధన లాభం (Capital Gains) పై 20 శాతం ఉన్న పన్ను ను 12.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించగా, అదే సమయంలో indexation తొలగిస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.
Indexation అంటే ఏమిటంటే, మూలధన లాభాల పన్నును (LTCG) లెక్కించేటప్పుడు ద్రవ్యోల్బణం కి అనుగుణంగా ఆస్తి కొనుగోలు ధరను సర్దుబాటు చేయడాన్ని ఇండెక్సేషన్ ప్రయోజనం అంటారు. తద్వారా మొత్తం LTCG తగ్గుతుంది. ఇది ప్రాపర్టీ అమ్మే వారిపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది.
అయితే ఈ ఇండెక్సేషన్ తొలగింపు నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం కీలక దిద్దుబాటుకి సిద్ధమైంది.
జూలై 23 కటాఫ్ – ఆ లోపు ప్రాపర్టీ కొన్న వారికి 2 ఆప్షన్
బడ్జెట్‌లో పేర్కొన్న దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పై పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపడుతుంది. 2024 జులై 23 కి ముందు వరకు కొనుగోలు చేసిన ప్రాపర్టీ లకు పన్ను విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఇందులో ఏదో ఒకటి ఎంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆర్థిక బిల్లులో మార్పులు చేపట్టింది.
రెండు ఆప్షన్లు ఇవే..
- 2024 జులై 23కు ముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీలకు ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5 శాతం పన్ను. లేదా
- ఇండెక్సేషన్ ప్రయోజనం తో కూడిన 20 శాతం పన్ను.. ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం కల్పించనుంది.
మొత్తానికి ఈ నిర్ణయంతో సిరాస్తి రంగంలో (Real Estate) అమ్మకాలు కొనుగోలు చేసే వారికి మరింత ఊరట ఇచ్చినట్లైందని చెప్పవచ్చు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు జోరందుకునే అవకాశం ఉన్నాయని చెప్పవచ్చు.