Pedala Sevalo Program – ప్రతీ నెల 1న ‘పేదల సేవలో’ కార్యక్రమం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Pedala Sevalo Program – ప్రతీ నెల 1న ‘పేదల సేవలో’ కార్యక్రమం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

గత ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికిందని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు తొలిసారిగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సు రాష్ట్ర అభివృద్దికి నాంది కావాలన్నారు. ప్రతీ నెల 1వ తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమంతో అధికారులంతా ప్రజలతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం అక్టోబర్ 2న విజన్ డ్యాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎంతో సమర్థులైన అధికారులు ఉన్నారన్నారు.

కానీ, గత 5 ఏళ్లలో అంతా నిర్వీర్యం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందన్నారు. మళ్లీ ఏపీ బ్రాండ్ నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు. ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో స్పందించాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేది అధికారులు వినాలన్నారు. వారి ఆలోచనలు అమలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం పై ఫేక్ ప్రచారాన్ని అధికారులు కూడా తిప్పి కొట్టాలన్నారు. అధికారులు, శాఖలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మంచిని చెప్పాలని.. తద్వారా తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలన్నారు. జిల్లా స్థాయిలో కూడా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలన్నారు. 100 రోజుల్లో మార్పు కనిపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

You cannot copy content of this page